- Home
- Life
- Gardening
- Tips for Fresh Flowers: ఫ్లవర్ వాజుల్లో పూలు రోజంతా తాజాగా ఉండాలంటే.. సింపుల్ టిప్స్ ఇవిగో
Tips for Fresh Flowers: ఫ్లవర్ వాజుల్లో పూలు రోజంతా తాజాగా ఉండాలంటే.. సింపుల్ టిప్స్ ఇవిగో
Tips for Fresh Flowers: ఇంటిని చక్కని పూలతో అలంకరిస్తే ఎంత అందంగా కనిపిస్తుందో కదా.. కాని రోజూ తాజా పూలు వాడలేక చాలా మంది ప్లాస్టిక్ పూలతో ఇంటిని అలంకరిస్తుంటారు. అయితే ఈ టిప్స్ పాటిస్తే ఒరిజినల్ పూలు కూడా ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి. అవేంటో చూద్దాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇల్లు అందంగా కనిపించాలని మహిళలు రకరకాల అలంకరణలు చేస్తుంటారు. రంగురంగుల వస్తువులతో డెకరేట్ చేస్తుంటారు. కాని ఫ్రెష్ పూలను ఫ్లవర్ వాజుల్లో పెట్టి ఇంట్లో అన్ని గదుల్లో పెడితే కంటికి ఇంపుగా ఉంటాయి. రంగురంగుల పూలు పెడితే మరింత కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. కొన్ని పూలు మంచి సువాసనను కూడా ఇస్తాయి. అయితే ఫ్రెష్ పూలు తర్వగా వాడిపోతాయి. అందుకే చాలా మంది ప్లాస్టిక్ పూలు వాడుస్తుంటారు. ఒరిజినల్ పూలు ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
పూలు కొనేటప్పుడే కాడ గట్టగా ఉన్నవి తీసుకోండి. కాడ ఎండిపోయినా, మెత్తగా ఉన్నా అవి తాజా పూలు కావని అర్థం.
మీరు వేర్వేరు రకాల పూలు కొనాలనుకుంటే వేర్వేరు కవర్లలో ప్యాక్ చేయించుకోండి. అన్నీ ఒకే కవర్ లో వద్దు.
ఇంట్లో ఫ్లవర్ వాజుల్లో తాజా పూలు పెట్టేటప్పుడు కాడలకు ఉన్న ఆకులు తీసేయండి. ఎందుకంటే ఫ్లవర్ వాజుల్లో ఉండే నీటిలో ఆకులు మునిగితే పాడైపోతాయి. పూలు త్వరగా వాడిపోతాయి.
ఫ్లవర్ వాజులను తరచూ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే వాడిపోయిన పూల నుంచి వచ్చిన క్రిములు, ఫంగస్ తాజా పూలను పాడుచేస్తాయి.
ఫ్లవర్ వాజుల్లో నీటిని ఏ రోజుకారోజు మార్చాలి. అవి రంగు మారినా, జిడ్డుగా అనిపించినా వెంటనే మార్చేయాలి. మురికి నీటిలో ఉంచిన పూలు త్వరగా వాడిపోతాయి.
ఇంట్లో ఎండ పడే ప్రదేశాల్లో ఫ్లవర్ వాజులను పెట్టకూడదు. ఎండ తగిలితే పూలు త్వరగా వాడిపోతాయి.
ఫ్లవర్ వాజుల్లోని నీటిలో కాస్త వెనిగర్ వేస్తే మంచిది. ఇది నీటిలోని, పూలలోని బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుంది. ఈ టిప్స్ పాటిస్తే మీ ఇల్లు తాజా పూలతో కళకళలాడుతూ ఉంటుంది.