- Home
- Life
- Spiritual
- 2026 Wedding Muhurtas: 2026లో అద్భుతమైన పెళ్లి ముహూర్తాలు..ఏ నెలలో ఎక్కువ ముహూర్తాలు..?
2026 Wedding Muhurtas: 2026లో అద్భుతమైన పెళ్లి ముహూర్తాలు..ఏ నెలలో ఎక్కువ ముహూర్తాలు..?
2026 Wedding Muhurtas: 2026 సంవత్సరంలో ప్రధానంగా ఫిబ్రవరి,మార్చి, ఏప్రిల్, మే,జూన్, జులై , డిసెంబర్ మాసాల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. శూన్య మాసాల్లో పెళ్లి ముహూర్తాలు ఉండవు.

2026 Wedding Muhurats
2026 సంవత్సరంలో వివాహం చేసుకోవాలనుకునే వారి కోసం పంచాంగం ప్రకారం అనేక అద్భుతమైన ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగే వేడు కాబట్టి, గ్రహ గతులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ శుభ కార్యాన్ని జరిపిస్తూ ఉంటారు. మరి, పంచాంగం ప్రకారం ఈ ఏడాది బెస్ట్ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...
2026 వివాహ ముహూర్తాలు..
2026 సంవత్సరంలో ప్రధానంగా ఫిబ్రవరి,మార్చి, ఏప్రిల్, మే,జూన్, జులై , డిసెంబర్ మాసాల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. శూన్య మాసాల్లో పెళ్లి ముహూర్తాలు ఉండవు.
నెలవారీగా ప్రధాన ముహూర్తాలు :
జనవరి 2026: జనవరి లో పెళ్లికి అనుకూలంగా ఎలాంటి ముహూర్తాలు లేవు.
ఫిబ్రవరి 2026: ఫిబ్రవరి 17 తర్వాత నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలౌతాయి. వసంత కాలం ప్రారంభం కావడంతో ఈ నెలలో పెళ్లిళ్ల సందడి ఎక్కువగా ఉంటుంది.19, 20, 21, 24, 25, 26 తేదీలు పెళ్లికి అనుకూలంగా ఉంటాయి.
మార్చి 2026.. 1, 3, 4, 7,8,9,11,12 తేదీలు మార్చి నెలలో పెళ్లికి అనుకూలంగా ఉంటాయి.
ఏప్రిల్ - మే 2026: ఎండాకాలం పెళ్లిళ్లకు పెట్టింది పేరు. ఏప్రిల్ నెలలో 15, 20, 21, 15, 26, 27, 28, 29 తేదీలు పెళ్లికి అనుకూలంగా ఉంటాయి. ఇక, మే నెలలో 1, 3, 5,6,7, 8,13, 14 తేదీలు కూడా అద్భుతంగా ఉంటాయి.
జూన్ 2026 - 21, 22, 23, 24, 25, 26, 27, 29
జూలై 2026 - 1, 6, 7, 11
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాతుర్మాసం కారణంగా పెళ్లికి అనుకూలమైన ముహూర్తాలు లేవు.
నవంబర్ 2026 - 21, 24, 25, 26
డిసెంబర్ 2026 - 2, 3, 4, 5, 6, 11, 12
ఈ ముహూర్తాలను దేని ఆధారంగా లెక్కిస్తారు?
వివాహ ముహూర్తాలను నిర్ణయించేటప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రధానంగా "శుద్ధ పంచాంగం" , "దృక్ సిద్ధాంతాన్ని" అనుసరిస్తారు. దీనికి ప్రాతిపదికలు ఇవే:
గురు , శుక్ర మూఢమి (Combustion): బృహస్పతి (గురుడు) లేదా శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వారి శక్తి క్షీణిస్తుంది. దీనిని 'మూఢమి' అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. 2026లో ఈ మూఢమి లేని సమయాలనే ముహూర్తాలుగా నిర్ణయించారు.
తారా బలం , చంద్రబలం: వధూవరుల జన్మ నక్షత్రం , రాశిని బట్టి ఆ రోజు వారికి అనుకూలంగా ఉందో లేదో చూస్తారు.
శుభ తిథులు: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులను వివాహానికి శ్రేష్ఠమైనవిగా భావిస్తారు.
నక్షత్రాలు: రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రేవతి వంటి స్థిర నక్షత్రాల్లో పెళ్లి చేయడం వల్ల బంధం బలంగా ఉంటుందని నమ్మకం.
శూన్య మాసాలు: సూర్యుడు కొన్ని రాశుల్లో ఉన్నప్పుడు (ఉదాహరణకు ఆషాఢ, భాద్రపద, పుష్య మాసాలు) వివాహాలను నిషిద్ధంగా భావిస్తారు.
గమనిక..
పైన పేర్కొన్న ముహూర్తాలు సాధారణ పంచాంగ లెక్కల ప్రకారం అందించాం. అయితే, వివాహం అనేది వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీ పురోహితులు లేదా సిద్ధాంతిని కలిసి, వధూవరుల జన్మ నామ నక్షత్రాల ఆధారంగా ఖచ్చితమైన 'సుముహూర్తాన్ని' నిర్ణయించుకోవడం ఉత్తమం.

