Dream: స్త్రీలకు కలలో మంగళసూత్రం కనపడితే అర్థం ఏంటి?
Dream: కలలు శుభ, అశుభ సంకేతాలను సూచిస్తూ ఉంటాయి. వివాహిత స్త్రీకి కలలో మంగళసూత్రం కనపడితే అర్థమేంటి? తాళి విరిగినట్లు లేదా తెగినట్లు కళ వస్తే అర్థమేంటి? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

స్వప్న శాస్త్రం..
హిందూమతంలో, మంగళసూత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహిత స్త్రీ ధరించే తాళి తన భర్త ఆనందం, దీర్ఘాయువు పెంచుతుందని నమ్ముతారు. మంగళసూత్రంలో మంగళం అంటే మంచి, శుభం అని అర్థం. సూత్రం అంటే దారం అని అర్థం. హిందూ గ్రంథాల ప్రకారం, తాళి తెగిపోవడం, విరిగిపోవడం అశుభంగా పరిగణిస్తారు. మరి, కలలో తాళి తెగినట్లు కనిపిస్తే దాని అర్థం ఏంటి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
తాళి తెగడం...
వివాహిత స్త్రీలు తమ కలలో తాళిని చూస్తే చాలా శుభంగా పరిగణిస్తారు. అలా కాకుండా... ఆ మంగళసూత్రం తెగినట్లు, కానీ విరిగినట్లు కానీ కలలో కనపడితే దానిని అశుభ శకునంగా పరిగణిస్తారు.
మెడలో నుంచి మంగళసూత్రం తీసినట్లు కల వస్తే.....
వివాహిత స్త్రీలు తమ మెడలో నుంచి మంగళసూత్రాన్ని తీసినట్లు కలలో కనపడితే... దానిని కూడా అశుభ సంకేతంగా పరిగణిస్తారు. భర్తకు ఏదైనా సమస్య రావడం లేదా, ఏదైనా విపత్తులో చిక్కుకోవడాన్ని ఈ కల సూచిస్తుంది. భర్త ఎదుర్కొంటున్న అధిక ఒత్తిడిని కూడా ఇది సూచిస్తుంది. ఇలాంటి కల వస్తే.. వెంటనే శివుడిని స్మరించుకోవాలి. భర్త దీర్ఘాయుష్షు కోసం దేవుడిని ప్రార్థించడం మంచిది.
మంగళసూత్రం కొంటున్నట్లు కల వస్తే...
ఒక వివాహిత స్త్రీ తన కలలో తాళి కొంటున్నట్లు చూస్తే, అది చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. అలాంటి కలలు మీరు మీ వివాహ జీవితానికి సంబంధించిన శుభకరమైనదాన్ని కొనుగోలు చేస్తారని సూచిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందడం లేదా, జీవితం శుభప్రదంగా మారుతుందని కూడా దీని అర్థం.
మంగళసూత్రం అమ్మడం...
మంగళసూత్రం కొనుగోలు చేయడం శుభప్రదం అయితే, తాళి అమ్ముతున్న కల ఒక అశుభానికి సంకేతం. మీరు తాళి అమ్ముతున్నట్లు కలలు కన్నట్లయితే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వప్న శాస్త్రం ప్రకారం , అలాంటి కల శుభప్రదంగా పరిగణించరు. మీ భర్త మిమ్మల్ని మోసం చేయవచ్చని అలాంటి కలలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి.
మరొకరికి మంగళ సూత్రం ఇస్తే...
కలలో వేరొకరికి మంగళసూత్రం ఇవ్వడం అంటే అది భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీస్తుంది. కలల సిద్ధాంతం ప్రకారం, అలాంటి కల అశుభంగా పరిగణిస్తారు. వివాహిత స్త్రీలు తమ మంగళసూత్రాన్ని ఎవరికీ ఇవ్వకూడదు లేదా వేరొకరి మంగళసూత్రాన్ని ధరించకూడదు. మీరు మీ తాళిని పోగొట్టుకున్నట్లు కలలు కన్నట్లయితే, మీ భర్త మరొక స్త్రీ సహవాసంలో ఉన్నారని ఇది సూచిస్తుంది.