Chanakya Niti: పెళ్లి తర్వాత భర్త పరాయి స్త్రీతో సంబంధం ఎందుకు పెట్టుకుంటాడు?
ఆర్థిక శాస్త్ర నిపుణుడు , తత్వ వేత్త ఆచారణ్య చాణక్యుడికి పరిచయం అవసరం లేదు. ఆయన ఆర్థిక పాఠాలు మాత్రమే కాదు, మానవ సంబంధాల గురించి కూడా చాలా విషయాలు తెలియజేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us

Chanakya niti
స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ ఉండటం చాలా సహజం. అయితే, చాలా మంది పురుషులు పెళ్లి తర్వాత కూడా తమ భార్యల పట్ల కాకుండా ఇతర స్త్రీల పట్ల కూడా ఆకర్షితులౌతూ ఉంటారు. ఇలా మరో స్త్రీ పట్ల మోజు పెంచుకోవడానికి వెనక కారణం ఉంటుందని ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు.
ఆర్థిక శాస్త్ర నిపుణుడు , తత్వ వేత్త ఆచారణ్య చాణక్యుడికి పరిచయం అవసరం లేదు. ఆయన ఆర్థిక పాఠాలు మాత్రమే కాదు, మానవ సంబంధాల గురించి కూడా చాలా విషయాలు తెలియజేశారు. మరి, అక్రమ సంబంధాల గురించి, మానవ బలహీనతలు, క్రమ శిక్షణ, తాత్కాలిక ఆనందం కోసం వెతకడం లాంటి చాలా విషయాల గురించి ఆయన చెప్పారు. చాణక్య నీతి లో ఈ విషయాలన్నీ పొందుపరిచారు. అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం...
ఇతర స్త్రీలతో పోలిక..
చాణక్యుడి మాటల్లో... చాలా మంది పురుషులు తమ భార్యలను ఇతర స్త్రీలతో పోల్చి చూస్తూ ఉంటారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా.. పొరుగువారి భార్య చాలా అందంగా, ప్రేమగా, సరదాగా ఉన్నరని అనుకుంటారు. కానీ ఇది కేవలం భ్రమ. దూరంగా ఉండే జీవితం ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపించొచ్చు కానీ, ఆ జీవితంలో ఉండే సమస్యలు మనకు కనబడవు. ఈ రకమైన ఆలోచన మన భార్యలోని మంచితనాన్ని గుర్తించకుండా చేస్తుంది. పైగా భార్యలో లోపాలు వెతకడం మొదలుపెడతారు. ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
చాణక్యుడు గమనించిన మరో విషయం ఏమిటంటే, కొంతమంది పురుషులు నిషేధించిన విషయాలవైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. “రహస్యంగా ఏదైనా చేయడం” వల్ల వచ్చే ఉత్సాహం కోసం, కొందరు ఇతరుల భార్యలతో సంబంధాలు ఏర్పరచేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ తాత్కాలిక ఆనందం, జీవితాంతం బాధను కలిగించవచ్చు.
ఇంట్లో ప్రేమ లేకపోతే...
వైవాహిక జీవితంలో భావోద్వేగంగా, శారీరకంగా, ప్రేమగా సంతోషంగా లేకపోతే పురుషులు ఆ సంతోషాన్ని బయట వెతుక్కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వారు ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందని చాణక్యుడు చెబుతున్నాడు.
స్నేహితుల ప్రభావం..
పురుషులపై స్నేహితుల ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మోసం చేయడం సరైనదిగా ప్రోత్సహించే స్నేహితులు ఉంటే.. ఆలోచనా ధోరణి కచ్చితంగా మారుతుంది.
ఆకర్షణలకు లొంగకుండా ఉండటం – అసలైన బలం
చాణక్యుని ప్రకారం, ఒక మనిషి నిజమైన బలం అతని స్వీయ నియంత్రణలో ఉంటుంది. తన కోరికలపై నియంత్రణ లేకపోతే, అతను తప్పు మార్గాన్ని ఎంచుకుంటాడు. సోషల్ మీడియా, పనిలో పరిచయాలు, స్నేహితులు వంటి విషయాలు మన నిజమైన స్వభావానికి పరీక్షగా మారతాయి.
పరిష్కార మార్గాలు ఏమిటి?
చాణక్యుడు సమస్యలే కాదు.. వాటికి పరిష్కారాలు కూడా సూచించాడు. భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలైనా సంకోచం లేకుండా చర్చించాలి. పరస్పరం గౌరవం, ఆప్యాయత కీలకమైనవి. స్నేహితుల ఎంపిక, వ్యక్తిగత నియంత్రణ, మన ఆత్మవిశ్వాసం – ఇవన్నీ సంసారాన్ని బలంగా నిలబెడతాయి.
ఫైనల్ గా...
బాహ్య సౌందర్యాన్ని కాకుండా, విలువలతో కూడిన, మనతో మనస్ఫూర్తిగా కలిసిపోయే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలి. ప్రతి పురుషుడు తన భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే వైవాహిక జీవితం స్థిరంగా, ఆనందంగా ఉంటుంది. చాణక్యుడి బోధనలూ ఇదే చెబుతున్నాయి.