Vishnu Mantras: ఈ మంత్రాలు జపిస్తే.. విష్ణుమూర్తి ఎప్పుడూ మీకు రక్షణగా ఉంటాడు!
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి మానసికంగా, శారీరకంగా రెండు రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు మెడిసిన్ తోపాటు కొన్ని విష్ణు మంత్రాలు జపిస్తే.. మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శక్తివంతమైన మంత్రాలు
పురణాల ప్రకారం ఈ లోకానికి రక్షకుడు విష్ణువు. ఆయన ఉనికి చాలా లోతైనది. శక్తివంతమైనది. ఆయన నామం తలిస్తే.. మానవులకు ప్రశాంత దొరుకుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు విష్ణువు మంత్రాలు జపిస్తే.. శాంతి, శక్తి, ఇతర కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. మరి ఆ శక్తివంతమైన మంత్రాలేంటో ఓసారి చూసేయండి.
1. ఓం నమో భగవతే వాసుదేవాయ
'ఓం నమో భగవతే వాసుదేవాయ' అంటే.. నేను భగవంతుడు వాసుదేవుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇందులో 12 అక్షరాలు ఉండటం వల్ల దీన్ని ద్వాదశాక్షర మంత్రం అంటారు. దీన్ని తేలికగా గుర్తుంచుకోవచ్చు. జపించవచ్చు. ఈ మంత్రం చదవడం లేదా వినడం వల్ల విష్ణు శక్తితో సంబంధం ఏర్పడుతుంది. శాంతి, మానసిక స్పష్టత కలుగుతుంది.
2. విష్ణు స్తుతి
'శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వధరం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం'. విష్ణువు ప్రశాంత స్వభావుడు. శేషనాగుపై ఉండేవాడు. కమలం కలిగినవాడు. దేవతలకు అధిపతి. విశ్వాన్ని కాపాడేవాడు. ఆకాశంలా కనిపించేవాడు. ప్రశాంత రూపం కలిగినవాడు అని దీని అర్థం. ఇది విష్ణువు లక్షణాలను, ఆయన స్వభావాన్ని తెలియజేస్తుంది. భక్తులు విష్ణువును స్మరించుకునేందుకు ఆయన ప్రశాంతమైన గొప్ప రూపాన్ని గుర్తు చేసుకునేందుకు దీన్ని పఠిస్తారు.
3. ఓం నమో నారాయణాయ
ఇది చాలా సింపుల్, శక్తివంతమైన మంత్రం. 'ఓం నమో నారాయణ' అంటే 'నేను విష్ణువు (నారాయణుడు) కి నమస్కరిస్తున్నాను' అని అర్థం. భక్తులు ఓం నమో నారాయణాయ అని జపించినప్పుడు వారిలో శక్తివంతమైన మార్పులు కనిపిస్తాయి. విష్ణువుకి భక్తుడు లొంగిపోవడం ద్వారా.. ఆయన ఆశీర్వాదం, రక్షణ పొందుతారు. ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా అంతకన్నా తక్కువ సార్లు పూర్తి భక్తి శ్రద్ధలతో జపిస్తే చాలా మంచిది.
4. మంగళ శ్లోకం
'మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షః, మంగళాయ తనో హరిః'. ఈ మంత్రం 'మంచికి ప్రతీక. గరుడ వాహనం, కమలం లాంటి కళ్లు కలిగిన విష్ణువు… జీవితంలో మంచిని, శ్రేయస్సును కలిగించాలని ప్రార్థిస్తున్నాను'. అని దీని అర్థం. ఇది మంచి ఆరోగ్యం, మంచి సంబంధాలు, మంచి జీవితం కోసం చేసే ప్రార్థన. పూర్తి భక్తితో ఈ మంత్రం పఠిస్తే ఆశీర్వాదం లభిస్తుంది. శుభకార్యాల ముందు దీన్ని పఠిస్తారు.
5. విష్ణు గాయత్రి మంత్రం
'ఓం శ్రీ విష్ణవాయ చ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్'. దీన్ని విష్ణు గాయత్రి మంత్రం అంటారు. జ్ఞానం, మార్గదర్శకత్వం, జీవితంలో వెలుగు కోసం విష్ణువుని ప్రార్థించే మంత్రం ఇది. దీన్ని క్రమం తప్పకుండా జపిస్తే మానసిక స్థిరత్వం కలుగుతుంది. ఏది జరిగినా విష్ణువు మనల్ని రక్షిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడనే నమ్మకం కలుగుతుంది.
6. లక్ష్మీ, విష్ణువు మంత్రం
'ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధ లక్ష్మీ నారాయణ నమః' అనే ఈ మంత్రం.. లక్ష్మీదేవి శక్తితో కలిసి సమతుల్యత, సంతృప్తినిచ్చే విష్ణువు మంత్రం. 'శ్రీం', 'హ్రీం', 'క్లీం' అనే అక్షరాలు జీవితంలోని వివిధ అంశాలను ఉత్తేజపరుస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ మంత్రం జపిస్తే మంచి శక్తులు ఆకర్షితమవుతాయి.