Zodiac Signs: అదృష్టమంటే ఈ 3 రాశుల వారిదే.. ఉగాది నుంచి భారీగా ధన లాభం
Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి జీవితాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తాయి. వాటి సంచారం వల్లనే జీవితంలో కష్టసుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు కలుగుతుంటాయని పండితులు చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది 3 రాశుల వారికి అద్భుతమైన కానుక ఇస్తోంది. ఉగాది ముందు రోజు నుంచి వారి జాతకాలు మారబోతున్నాయి. ఈ 3 రాశుల వారికి భారీగా ధన లాభం కలుగుతుంది. ఆ రాశులు ఏంటి? ఎలా కాసుల వర్షం కురుస్తుంది తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు కాలానుగుణంగా తమ స్థానాలను మారుస్తూ ఉంటాయి. దీని వల్ల 12 రాశుల జాతకులపైనా వాటి ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు ఒకే రాశిలో అనేక గ్రహాలు కలుస్తుంటాయి. దీని వల్ల అనేక యోగాలు ఏర్పడతాయి.
ఇప్పుడు మీన రాశిలో శుక్రుడు, రాహువు, శని ఈ మూడు కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పరుస్తున్నారు. ఈ విధంగా గ్రహాలు కలిసినప్పుడు రాజయోగం ప్రారంభమవుతుంది. అలాంటి జాతకులకు ఈ సమయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం కలిసిన రాశులకు అదృష్టం కలుగుతుంది.
త్రిగ్రాహి రాజయోగం ఎప్పుడు
మీన రాశిలో శుక్రుడు, రాహువు, శని కలవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది మార్చి 2025 నెలాఖరున ఏర్పడుతుంది. అంటే మార్చి 29న ఈ మూడు గ్రహాల కలయిక ఏర్పడి త్రిగ్రాహి రాజయోగం ప్రారంభమవుతుంది.
వాస్తవానికి త్రిగ్రాహి రాజయోగం 12 రాశులపైనా ప్రభావం చూపుతుంది. అయితే ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తుంది. ఆ రాశులు ఏవంటే..
కుంభ రాశి
కుంభ రాశి జాతకులకు కూడా త్రిగ్రాహి రాజయోగం కలుగుతుంది. దీనివల్ల వారి జీవితంలో వివిధ రకాల ఆనందకరమైన మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోయి శక్తిని పుంజుకుంటారు. కుంభరాశిలో ఉన్న నాయకులు ఎవరైనా నాయకత్వ బాధ్యతల్లో మరో మెట్టు ఎక్కుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిధున రాశి
మిధున రాశి జాతకులు త్రిగ్రాహి రాజయోగం వల్ల ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధిస్తారు. ఈ రాజయోగం వల్ల జీవితంలో వివిధ రకాల సమస్యలు తీరిపోతాయి. అనుకున్న రంగంలో రాణించి విజయాలు సొంతం చేసుకుంటారు. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. జీతం పెరుగుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు పరంగా కూడా అభివృద్ధి చెందుతారని పండితులు చెబుతున్నారు. కొత్త ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇది కూడా చదవండి ఉగాది ఎప్పుడు? కరెక్ట్ తేదీ, తిధి తదితర వివరాలు ఇవిగో
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు త్రిగ్రాహి రాజయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. దీని వల్ల వారి జీవితంలో వివిధ రకాల మంచి ఫలితాలు కలుగుతాయట. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇతరుల నుండి గౌరవం, మర్యాద పెరుగుతుందని, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
అంతే కాకుండా వ్యాపారంలో భారీ విజయం సాధిస్తారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అన్ని ప్రయత్నాల్లోనూ అదృష్టం కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. కొత్త ప్రయత్నాల్లో అభివృద్ధి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
గమనిక : ఈ రాశి ఫలితాలు పూర్తిగా పండితులు ఇచ్చిన సమాచారం మేరకు మీకు అందిస్తున్నాం. జ్యోతిష్య శాస్త్రం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.