Ugadi: ఉగాది ఎప్పుడు? కరెక్ట్ తేదీ, తిధి తదితర వివరాలు ఇవిగో
Ugadi: సాధారణంగా హిందూ పండగల్లో తిధి వార, నక్షత్రాల సమయాల్లో మార్పుల కాలంగా పండగల తేదీలు ఒకరోజు అటు, ఇటు అవుతుంటాయి. అయితే ఈ ఉగాది పండగ ఎప్పుడు వస్తుంది? ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకోవాలి? దీని విశిష్టతలు తదితర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఉగాది పండగ దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన పండగల్లో ఒకటి. ఈ పండగను తెలుగు వాళ్లంతా బాగా జరుపుకుంటారు. నిజానికి ఉగాదితోనే తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది. జనవరి 1న జరుపుకొనేది బ్రిటిష్ సంప్రదాయపు సంవత్సరాది. ఆంగ్లేయుల కాలం నుంచి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడంలోనూ మార్పులు వచ్చాయి కాని వాస్తవానికి ఉగాదినే న్యూ ఇయర్ ప్రారంభంగా భావించాలని పండితులు చెబుతున్నారు. ఇంత విశిష్టత ఉన్న ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా బాగా జరుపుకుంటారు.
ఉగాది పండగ ప్రాముఖ్యత
ఉగాది అంటే కొత్తగా ప్రారంభమయ్యేది అని అర్థం. ఈ కొత్తగా ప్రారంభమయ్యే రోజు నుంచి జీవితం కూడా ఆనందంతో నిండాలని కోరుకుంటారు. అయితే జీవితం అంటే కష్టసుఖాల సమ్మేళనం. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అందులో ఆరు రకాల రుచులు కలిపి తయారు చేస్తారు. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు ఇలా ఆరు రుచులతో నిండిన ఈ పచ్చడి జీవితం ఎలాంటిదో తెలియజేసేందుకు ఉదాహరణ. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఉగాది రోజు నుంచి కొత్తగా, కొత్త పనులతో జీవితం ప్రారంభించాలని పండితులు చెబుతారు.
ఉగాది 2025 తేదీ, సమయం
2025 సంవత్సరం ఉగాది పండగ మార్చి 30వ తేదీ ఆదివారం నాడు జరుపుకుంటారు. పాడ్యమి తిథి మార్చి 29వ తేదీ సాయంత్రం 4.27 గంటలకు ప్రారంభమై మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12.49 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథే లెక్క కాబట్టి మార్చి 30న ఉగాది పండగ నిశ్చయించారు.
ఇది కూడా చదవండి: అయోధ్య వెళ్తే ఈ 10 అద్భుతమైన ప్రదేశాలు తప్పక చూడండి
ఉగాది పండగ జరుపుకొనే విధానం
ఉగాది పండగ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడిని పూజించాలి. తర్వాత ఉగాది ప్రత్యేక వంటకాలైన ఉగాది పచ్చడితో పాటు రకరకాల వంటలు చేసి చుట్టుపక్కల వారికి, బంధువులకు పంచి అందరితో కలిసి తినాలి. అంతేకాకుండా ఈ రోజున పంచాంగ శ్రవణం చేయాలి. ఆ సమయంలో పండితులు చదివే వేద మంత్రాలు మనకు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
ఉగాది పండగ రోజు బ్రహ్మ ముహూర్త సమయంలో సూర్యోదయానికి ముందే ఇంటి పూజ గదిలో ఐదు దీపాలు వెలిగించాలి. ఇంట్లో అమ్మవారిని పూజిస్తుంటే అమ్మవారి విగ్రహంతో పాటు పసుపు వినాయకుడిని తయారుచేసి దీపారాధన చేసి పూజించాలి. వండిన పిండి వంటలు స్వామి వారికి, అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా పూజిస్తే మీ జీవితంలో అశుభాలు తొలగి, శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి మొబైల్‌లో దేవుడి ఫొటో వాల్‌పేపర్‌గా పెట్టడం మంచిది కాదు.. ఎందుకో తెలుసా?