ఉద్యోగం చేయని భర్తకు సమాజంలో గౌరవం ఉంటుందా?
మనలో కష్టపడేతత్వం (Difficulty), నిజాయితీ (Honest) ఉన్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. సమాజం దృష్టిలో మనం మంచిగా ఉంటేనే మనకంటూ గౌరవం దక్కుతుంది. సమాజం ఎప్పుడూ ఒక్కరిని వేలెత్తి వారిలోని తప్పులను వెతుకుతుంది. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనకంటూ గౌరవం ఏర్పడాలంటే కష్టపడుతూ ఇతరుల మీద ఆధారపడకుండా మన సొంత కష్టార్జితం మీద బ్రతకాలి. అప్పుడే సమాజం గౌరవిస్తుంది. ఇలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు ఉద్యోగం చేయని భర్త సమాజంలో గౌరవంగా బ్రతకగలడా? అనే విషయంపై చర్చిస్తూ వారిలో చైతన్య స్ఫూర్తిని కల్పించడమే ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం..
దాంపత్య జీవితంలో (Married life) మొదట వారి జీవన ప్రయాణం హాయిగా సాగుతుంది. అయితే భర్త కొన్ని చెడు వ్యసనాలకు (Bad addictions) బానిస కావడంతో తనలో కష్టపడాలనే ఆలోచనే ఉండదు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఉద్యోగం చేయడానికి ఇష్టం ఉండదు. భార్య సంపాదన మీదే ఆధారపడి తన జీవనాన్ని కొనసాగిస్తాడు.
ఇలా చెడు వ్యసనాలకు, చెడు సావాసాలకు బానిస కావడంతో సమాజం (Society) దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతాడు. ఉద్యోగం చేయలేని భర్త సమాజంలో గౌరవాన్ని (Respect) కోల్పోతాడు. అందరి దృష్టిలో తను చులకన అయిపోతాడు. భార్య సంపాదన మీద ఆధారపడడంతో ఆమె మనసులో తనకున్న స్థానాన్ని కోల్పోతాడు.
ఇది ఆమెకు తీరని వేదనను మిగులుస్తుంది. కష్టపడే కండ శక్తి ఉన్న పని చేయకుండా విలాసవంతంగా (Luxuriously) తిరుగుతుంటాడు. నలుగురిలో తనకంటూ గౌరవం ఉండదు. ఇలాంటి భర్తను సమాజం వేలెత్తి చూపుతుంది. ఇలాంటి భర్త ఉన్నా లేకున్నట్టు భార్య భావిస్తుంది (Thinks). తనను కన్న తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేస్తారు.
చివరికి తనకు పుట్టిన పిల్లల (children) దృష్టిలో కూడా చులకన అయిపోతారు. మీ చెడు అలవాట్లు మీ పిల్లల భవిష్యత్తుకు (Future) ఇబ్బంది కలుగుతుంది. మీ అలవాట్లను మీ పిల్లలు అనుసరించే ప్రమాదం ఉంటుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవించరు. తండ్రి స్థానం ఎప్పుడూ పిల్లల దృష్టిలో గొప్పగా ఉండాలి.అప్పుడే వారు తండ్రి పట్ల మరింత ప్రేమను చూపుతారు.
ఉద్యోగం (Job) అనేది పురుష లక్షణం. తను చేసే ఎంత చిన్న పని అయినా తనలోని కష్టపడే తత్వాన్ని సమాజం అర్థం చేసుకుంటుంది. తన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. తన భార్య దృష్టిలో తన స్థానం గొప్పదిగా ఉంటుంది. కాళ్ళు చేతులు లేని వారి కూడా తమ కుటుంబం కోసం ఏదో ఒక పని చేసుకుంటూ ఆర్థికపరంగా (Financially) సహాయం చేస్తూ కష్టపడుతుంటారు.
అన్నీ అవయవాలు (Organs) చక్కగా ఉండి ఏ పని చేయకుండా భార్య సంపాదనే మీదే ఆధారపడి బతుకుతున్న భర్తలను సమాజం చీడపురుగుల చూస్తుంది. వారికి సమాజంలో గౌరవం ఉండదు. తన గురించి అనేక విధాలుగా మాట్లాడుతూ కించపరిచే (Degrading) ప్రయత్నం చేస్తుంది. సమాజంలో తన కంటూ ఒక గౌరవం పొందాలంటే తనకు తోచిన ఏ చిన్న పనినైనా చేస్తూ నిజాయితీగా బతకాలి. అప్పుడే తన కుటుంబ సభ్యులు దృష్టిలో మంచి స్థానాన్ని పొందుతాడు.