Relationship: ఆడాళ్లు.. మీరు వివాహేతర సంబంధం లో ఉన్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!
Relationship: క్షణికావేశం లోనో, లేదా ఉన్న జీవితం మీద తృప్తి లేకనో చాలామంది ఆడవాళ్లు వివాహేతర సంబంధానికి పూనుకుంటూ ఉంటారు. అయితే దానివలన ఎదురయ్యే సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు దాంపత్య జీవితానికి ఎంతో విలువ ఉండేది. ఒకసారి పెళ్లి అయిన తర్వాత మంచివాడు అయినా చెడ్డవాడైనా జీవితకాలం వాళ్ళిద్దరూ మాత్రమే జంటగా ఉండేవారు. అయితే ప్రస్తుత కాలంలో ఆడవాళ్లు కూడా ఎక్కువగా అక్రమ సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు.
క్షణికానందాల కోసం, క్షణిక సుఖాల కోసం వారు తీసుకునే నిర్ణయాలు నలుగురు జీవితాలని, కొన్ని కుటుంబాలని క్షోభ కి గురిచేస్తుంది. అక్రమ సంబంధానికి పాల్పడిన మహిళ నిత్యం జీవితాన్ని భయంగా గడుపుతూ ఉండాలి. ఎక్కడ నిజం బయటపడుతుందో అని నిత్యం అప్రమత్తంగా ఉండాలి.
ఒకవేళ నిజం బయటపడినట్లయితే దాని ప్రభావం నలుగురి జీవితాల మీద పడుతుంది. అలాగే నలుగురిలోనూ అవమానంగా బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భర్తకి దూరమై నిండైన సంసారాన్ని చేజార్చుకోవలసిన పరిస్థితి వస్తుంది.
మీరు అక్రమ సంబంధానికి పాల్పడిన వ్యక్తి మిమ్మల్ని అశ్రద్ధ చేస్తే అప్పుడు పూర్తిగా రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వస్తుంది, చక్కనైన జీవితం కోల్పోవలసి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.
అంతేకాకుండా మరొక ఆడదానికి అన్యాయం చేశాను అనే అపరాధ భావన మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ విషయం అవతలి వ్యక్తులు సీరియస్ గా తీసుకున్నట్లయితే పోలీస్ కేసులు వరకు వెళ్లి బ్రతుకు బజారున పడుతుంది. కాబట్టి ఒక్క తప్పు అడుగు వేసే ముందు ఇన్ని ప్రమాదాలు ముందుంటాయని గ్రహించండి.
ఎవరి జీవితము 100% పూలబాట కాదు, సుఖంగా ఉన్నాడు అనుకునే ప్రతి మనిషిలోని తన వెర్షన్ లో తనకి కష్టాలు ఉంటాయి. కాబట్టి మన జీవితంలో కష్టసుఖాలను భరిస్తూ మన కాపురాన్ని చక్కదిద్దుకోవడం చాలా మంచిది. కేవలం మీ ఒక్కరి కోసం మాత్రమే కాదు మీ పిల్లల కోసం కూడా ఆలోచించి కాపురాన్ని సరిదిద్దుకునే దిశగా అడుగు ముందుకు వేయండి.