కన్వత్యం కోల్పోవడం అంటే ఏమిటి? దానివల్ల ఏం జరుగుతుందంటే..
కన్యత్వం కోల్పోవడం.. ఇది పెద్ద అపోహ. చిన్నప్పటినుంచి కుటుంబాలు, సమాజం మహిళల మెదడుల్లో నింపేసింది. దీంతో చాలాసార్లు అమ్మాయిలు కన్వత్యం.. వర్జినిటీ.. అనే విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. కన్వత్వం కోల్పోవడం అంటే అసలు ఏంటంటే.. యోనిలోపల ఉండే హైమన్ పొర చిరిగిపోవడమే.
హైమన్ పొర చిరిగిపోవడం కేవలం కలయికలోనే జరగకపోవచ్చు. చిన్నతనంలో ఆడుకునే సమయంలో కూడా జరగొచ్చు. కానీ, దీనిచుట్టూ ఉన్న అపోహలు, అనుమానాలు మహిళల్ని తమ శరీరం గురించి అవగాహన లేకుండా చేస్తాయి. అందుకే చాలామంది మహిళలు కన్వత్యపరీక్షలు ఎదుర్కొంటున్నారు. అవమానాలపాలవుతున్నారు. హైమన్ పొర చిరిగిపోవడం.. అంటే కన్యత్వం కోల్పోవడం అంత పెద్ద సమస్యా? దీని తరువాత ఏం జరుగుతుంది. శరీరంలో ఏమైనా మార్పులు వస్తాయా?
నిజానికి ఏమీ మారదు...
నిజం చెప్పాలంటే, కన్యత్వాన్ని కోల్పోయిన తర్వాత నిజంగా ఏమీ మారదు. హైమెన్ పొర ఇకపై అలాగే ఉండకపోవచ్చు, మీలో హార్మోనల్ చేంజెస్ రావచ్చు. కానీ మీరు, నిజంగా మారరు. అంతేకాదు, మీరు సంతోషంగా సెక్స్ ను ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి మనసు పెద్దగా బాధకు గురికాదు.
ఫీలింగ్స్ పెరుగుతాయి...
మొదటిసారి కలయిక తరువాత.. ఆ వ్యక్తి పట్ల మీ అభిప్రాయాల్లో మార్పు వస్తుంది. అతనిమీద మీకు ఫీలంగ్స్ పెరుగుతాయి. చాలా అధ్యయనాలు ఇది రుజువు చేస్తున్నాయి. దీని ప్రకారం.. చాలామంది అమ్మాయిలు మొదటిసారిగా తనతో సెక్స్ చేసిన వ్యక్తి మీద ఫీలింగ్స్ పెంచుకుంటారు. ఇది పరస్పరం కాకపోవచ్చు. అయితే, శాశ్వతం కూడా కావు. ఈ ఫీలింగ్స్ తాత్కాలికమైనవి.
sexual releation
సెక్స్ తర్వాత ఫీలింగ్స్ ఎందుకు కలుగుతాయంటే..
శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా సన్నిహిత చర్య, ఇది వారి మధ్య బలమైన ఫీలింగ్స్ ను కలిగిస్తుంది. ప్రజలు సెక్స్ చేసినప్పుడు, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ శరీరంలోకి విడుదల అవుతుంది, ఇది ప్రేమ, ఆప్యాయత, కోరిక వంటి భావోద్వేగాలను పెంచుతుంది. కాబట్టి, సెక్స్ తర్వాత ఫీలింగ్స్ ఎక్కువవ్వడం చాలా సాధారణం. కానీ ప్రతి ఒక్కరికీ ఇలాగే జరుగదు.
మీ రూపురేఖల్లో మార్పు ఉండదు..
శృంగారం తరువాత మీ శరీరంలో, మీ రూపంలో ఎలాంటి మార్పు ఉండదు. ముందు ఎలా ఉన్నారో, లాగే ఉంటారు. మీరు మీ కన్యత్వాన్ని కోల్పోయారా? లేదా? అనేది ఇతరులు గ్రహించే అవకాశం అస్సలు లేదు.
మానసిక స్థితిలో మార్పు వస్తుంది..
శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. మొదటిసారి శృంగారం అన్నప్పుడు రకరకాల భావోద్వేగాలు మనసును కలవరపెడతాయి. కానీ చివరికి అవి స్థిరపడి మీరు శృంగారాన్ని ఆస్వాదిస్తారు. అయితే కొంతమంది మానసికంగా సిద్ధపడకుండానే సెక్స్ తో పాల్గొంటారు. అలాంటి సమయంలో భాగస్వామికి సరిగా సహకరించకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అదే వ్యక్తితో ఉండాలా?
శృంగారం చుట్టూ అనేక అపోహలున్నాయని ముందే చెప్పుకున్నాం కదా.. అలాంటి వాటిల్లో ఒకటి కన్యత్వాన్ని కోల్పోయిన వ్యక్తితోనే జీవితాంతం ఉండడం. అయితే అది మీకు కష్టంగా ఉండొచ్చు. ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి అతనితో ఉండాలనే దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సహజమైన చర్య.