Relationship: మీ బంధాన్ని పటిష్టం చేసుకోవాలా.. అయితే ఈ కపుల్స్ గోల్స్ మీకోసమే?
Relationship: ఈరోజుల్లో ప్రేమ, పెళ్లి అనే బంధాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అందుకే చిన్ని చిన్ని మార్పులతో, సర్దుబాటులతో కపుల్ గోల్స్ పెట్టుకోవడంతో ఎలా మీ బంధాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఈరోజుల్లో బంధం ఎంత త్వరగా విచ్ఛిన్నం అయిపోతుంది అంటే చిన్న చిన్న విషయాలకి కూడా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. వెతికితే ఎక్కడా పెద్ద కారణాలు కనిపించవు. అన్ని చిన్నచిన్న కారణాలే కాకపోతే ఇక్కడ సమస్య ఈగో వల్ల వస్తుంది. నేనే ఎందుకు తగ్గాలి అనే అహం ఒక బంధాన్ని విచ్చన్నం చేస్తుంది.
అయితే చిన్ని చిన్ని సర్దుబాటులతో ఒక బంధాన్ని ఎలా నిలుపుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈరోజు సోషల్ మీడియాలో కానీ యువతరం మాటల్లో గానీ ఎక్కువగా వినిపిస్తున్న పదం కపుల్ గోల్స్. అయితే ఏంటి ఈ కపుల్ గోల్స్ అంటే ఒక జంట తమ మధ్య ఉన్న అన్ని విషయాలని అర్థం చేసుకొని తెలుసుకొని అన్ని విషయాలను సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోవటం.
జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు సమానంగా బాధ్యత వహించటం. చాలామంది తమ పరిస్థితిని బట్టి తమ జీవితం ఆధారంగా తమ బంధాలని నిలుపుకోవటం కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటున్నారు వాటిని సాధించడం కోసం గోల్స్ పెట్టుకుంటున్నారు. ఈ గోల్స్ ని సాధించడం కోసం లైఫ్ పార్ట్నర్ తో కలిపి అడుగులు వేస్తున్నారు.
ఇది మంచి పరిణామమే అంటున్నారు కౌన్సిలర్స్. నేటి తరం జంటలు తమ తల్లిదండ్రుల్లాగా కాకుండా వాళ్ళ పిల్లల పెంపకం వరకు మాత్రమే తమ జీవితాన్ని పరిమితం చేయాలి అనుకోవడం లేదు పిల్లలే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
నిపుణులు కూడా అదే చెప్తున్నారు మీకోసం మీరు జీవిస్తే అది మీ జంటని మరింత దగ్గర చేస్తుంది. ఇంకా బంధాన్ని నిలుపుకోవడం కోసం ఎంత పెద్ద గొడవ అయినా మాటలు మానేయడం లాంటివి చేయకండి ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత పెద్ద బంధాన్ని అయినా ముక్కలు చేస్తుంది.
అలాగే ప్రతి మూమెంట్ ని లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఎంజాయ్ చేయండి అది మీ పార్టనర్ కి మరింత ఆనందాన్ని ఇచ్చి మీకు మరింత చేరువ చేస్తుంది. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవడం వలన కూడా దంపతులు మరింత దగ్గరవుతారు. సో నేటి తరం దంపతులు మీరు కూడా ఈ కపుల్ గోల్స్ పెట్టుకొని జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయండి.