మోసం చేసిన భాగస్వామిని క్షమించడమెలా?
ఎందుకు వారిని క్షమిస్తున్నారో కూడా చెప్పాలి. తర్వాత మీ బంధం ఎలా ఉండాలి అనుకుంటున్నారో కూడా వారికి ఇప్పుడే చెప్పడం అవసరం.
ఈ మధ్యకాలంలో చాలా మంది వివాహేతర సంబంధాలకు అలవాటు పడిపోతున్నారు. తమ భాగస్వామిని మోసం చేస్తున్నాం అని తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. చాలా కాలానికి రియలైజ్ అయ్యి మళ్లీ తమ భాగస్వామి వద్దకు చేరుకుంటారు. అలా తప్పు చేసిన భాగస్వామిని మళ్లీ క్షమించాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఒకవేళ క్షమించాలని అనుకున్నా... చాలా మందికి మనసు ఒప్పుకోదు. నిజంగా క్షమించాలి అనుకుంటే ఇలా ప్రయత్నించండి.
భాగస్వామి మోసం చేశారు అనగానే కోపం, బాధ, ఉక్రోశం రావడం చాలా కామన్. కానీ వారిని మీరు నిజంగా క్షమించాలని అనుకుంటున్నారో లేదో చెక్ చేసుకోవాలి. మీ ఫీలింగ్స్ ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ బంధాన్ని ముందుకు కొనసాగించాలని అనుకుంటున్నారో లేదో తెలుసుకోవాలి.
మీ భాగస్వామితో ఈ విషయం గురించి నిజాయితీగా మాట్లాడాలి. మీరు ఏమనుకుంటున్నారో..? మీరు ఎంత బాధపడ్డారో కూడా వారికి వివరించాలి. ఎందుకు వారిని క్షమిస్తున్నారో కూడా చెప్పాలి. తర్వాత మీ బంధం ఎలా ఉండాలి అనుకుంటున్నారో కూడా వారికి ఇప్పుడే చెప్పడం అవసరం.
మీరు మాట్లాడినా ఉపయోగం ఉండదు అనిపిస్తే, ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. వారితో మాట్లాడి, మీ బంధం కొనసాగించడానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. వారు మీకు ఏది కరెక్టో గైడ్ చేస్తారు. వారితో మాట్లాడటం వల్ల మీరు మీ బాధ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది.
మళ్లీ మీరిద్దరూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇద్దరూ బౌండరీస్ క్రియేట్ చేసుకోవడం అవసరం. జరిగిపోయిన దాని గురించి ఇద్దరూ క్లియర్ గా మాట్లాడుకోవాలి. మరోసారి ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి.
ఇక మీ భాగస్వామి మిమ్మల్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఆయన మరోసారి అలా చేయకుండా ఉండాలి అంటే, వారు సెక్స్ విషయంలో ఏం కోరుకుంటున్నారో అది మీరు అందించాలి. అప్పుడు వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండదు.
Cheating husband
మీరు మీ గురించి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. మీరు కూడా లైఫ్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మీ అందం, ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి.