మీ భార్య లేదా భర్త నిజం చెప్తున్నారో? అబద్దం చెప్తున్నారో ఇలా తెలుసుకోండి
అందరూ అన్ని నిజాలే చెప్తారనుకోవడం పొరపాటే. అయితే అబద్దాలను గుర్తించడం చాలా మందికి రాదు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో అవతలి వారు అబద్దాలు చెప్తున్నారో లేక నిజం చెప్తున్నారో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం పదండి.
ప్రతి వ్యక్తికి కొన్ని లోపాలుంటాయి. వాటిలో అబద్ధం చెప్పే అలవాటు ఒకటి. సంబంధాలను కాపాడటానికి లేదా ఒకరి మంచి కోసం మాట్లాడే అబద్ధం వేరే విషయం. కానీ అబద్దాలను మీ రోజువారీ అలవాటులో భాగం చేసినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఇది మీ బంధంలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. అందుకే అబద్దాలను మాట్లాడకుండా చూసుకోవాలి. మరి మీ భార్య లేదా భర్త మీకు నిజం చెప్తున్నారో, అబద్దం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
తెల్ల ముఖం వేయడం
ఎదురుగా ఉన్న వ్యక్తి నిజం మాట్లాడుతున్నా, అబద్ధం చెప్తున్నా అతని ముఖమే మీకు సాక్ష్యం చెబుతుంది. అబద్ధం చెప్పినప్పుడు వారు తరచుగా తెల్ల ముఖమేస్తారు. అలాగే అపరాధభావం వల్ల కూడా ముఖం ఎర్రగా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా వారు చెప్పేది అబద్దమని చెప్పేయొచ్చు.
పెదవులు నలపడం
పెదవుల ద్వారా కూడా అవతలి వారు మీకు అబద్దం చెప్తున్నట్టు తెలిసిపోతుంది. ఒకవేళ మీకు వారు అబద్దాలను చెప్తున్నట్టైతే వారి రెండు పెదవులు తరచుగా నలుపుతారు. మీ భాగస్వామి ఇలా చేస్తే ఖచ్చితంగా అబద్దాలు చెప్తున్నట్టే..
స్వరం మార్పు
ఒక వ్యక్తి మాట్లాడే విధానంలో అకస్మాత్తుగా మార్పు వస్తే అది కూడా అబద్ధానికి సంకేతమే. ఒకవేళ మీ భాగస్వామి మీకు అబద్దాలు చెప్తున్నట్టైతే గొంతు ఆటోమెటిక్ గా మారడం ప్రారంభిస్తుంది. దీంతో మీరు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏదో దాచిపెడుతున్నాడని నిర్ణయించుకోవాలి.
బ్లింకింగ్
ముఖమే మనకు ఎన్నో విషయాలను చెబుతుంది. అబద్ధాలను కూడా ముఖం చాలా సులువుగా చెప్పేస్తుంది. ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు వారి కనురెప్పలు తరచుగా కొట్టుకోవడం ప్రారంభిస్తాయి. అలాగే ఎప్పుడెప్పుడు ఈ విషయానికి బ్రేక్ పడుతుందా అని ఎదురుచూస్తారు. ఇలాంటి వారు కళ్లలోకి చూసి మాట్లాడలేరు.