MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • భార్య లేదా భర్త నుంచి వీటిని అస్సలు ఆశించకండి.. లేదంటే కొట్లాటలవుతయ్

భార్య లేదా భర్త నుంచి వీటిని అస్సలు ఆశించకండి.. లేదంటే కొట్లాటలవుతయ్

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలన్నా.. ఎలాంటి కొట్లాటలు, గొడవలు రాకూడదన్నాఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోవాలి. అలాగే బంధాన్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఇద్దరిపైన ఉంటుంది. అయితే కొత్త రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టగానే ఇద్దరిపై ఎన్నో రకాల బాధ్యతలు పడతాయి. అయితే బాధ్యతల కారణంగా.. కొన్ని కొన్ని సార్లు మీ భాగస్వామి మీ అంచనాలను చేరుకోకపోవచ్చు. అందుకే భార్య లేదా భర్త నుంచి కొన్నింటిని ఆశించకూడదు. అవేంటంటే?   

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 09 2023, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఏదైనా కొత్త సంబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతలు బాగా పెరుగతాయి. వీటితో పాటుగా ఒకరిపై ఒకరికి అంచనాలు కూడా పెరుగుతాయి. ఈ రెండే మీ బంధం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. అయితే అంచనాలు కొన్నిసార్లు లింగంపై కూడా ఆధారపడి ఉంటాయి. అంటే భార్య ఇంటి పనులు చక్కబెట్టుకోగలగాలి. అలాగే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలు కూడా తమ భర్తల నుంచి ఎన్నో విషయాలను ఆశిస్తారు. రిలేషన్ షిప్ లో భాగస్వామిపూ కొన్ని అంచనాలను పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈ అంచనాల వల్ల మీ మధ్య గొడవలు, కొట్లాటలు రాకుండా ఉండాలి. ఈ అంచనాలే మీరు విడిపోయేలా చేస్తాయి. మరి భాగస్వామి నుంచి ఎలాంటి అంచనాలు పెట్టుకోకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నన్ను వదిలేస్తావా? 

నన్ను వదిలేసి వెళ్లిపోతారేమో అన్న అభద్రత భావం ఆడవాళ్లలోనే కాదు మగవారిలో కూడా ఉంటుంది. ఈ కారణంగా వీళ్ల మనస్సులో సందేహం, అపనమ్మకం నిండిపోతాయి. అలాగే దీనివల్ల వీరు తరచుగా గొడవ పడొచ్చు. కానీ సంబంధం ఎప్పుడు ఒకేలా ఉండదని తెలుసుకోండి. వైవాహిక జీవితంలో గొడవలు, కొట్లాటలతో పాటుగా వివిధ హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయి. అంత మాత్రానా విడిపోతారు అనుకోవడం పిచ్చితనమే అవుతుంది. అందుకే నన్ను వదిలేస్తావా అని పదేపదే మీ భాగస్వామిని అడగకండి. ఇది వాళ్లకు చిరాకు కలిగిస్తుంది.

34

మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే మీ భాగస్వామి పని కాదు

సంతోషంగా ఉంచే బాధ్యత ఒకరి భుజాలపైనే ఉండకూడదంటారు నిపుణులు. ఇక మీ భాగస్వామి ఏ మూడ్ లో ఉన్నా మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని ఆశించడం పెద్ద తప్పు. ఇలా సంతోషంగా ఉంచాలనుకునే ప్రయత్నం రెండు వైపుల నుంచి ఉండాలి. అప్పుడే మీ బంధం ఆనందంగా ముందుకు సాగుతుంది. ఒకరి అవసరాలు, పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుంటే సంతోషంగా ఉంటారు. దీనివల్ల మీరు ప్రత్యేకంగా మీ భాగస్వామిని సంతోషపెట్టాల్సిన అవసరము కూడా ఉండదు. 
 

44

ప్రతి దానికీ ఒప్పుకోవాలి

ఒక్కొక్కరి ఆలోచనలను ఒక్కోలా ఉంటాయి. అందుకే మీరు చెప్పే ప్రతిదానికి మీ భాగస్వామి అవును అని చెప్తారని ఆశించడం కూడా తప్పే అవుతుంది. దీనికోసం భార్యా లేదా భర్తపై ఒత్తిడి తేవడం, కోపగించుకోవడం లాంటి పొరపాట్లు చేయకండి. ఎందుకంటే వీటివల్ల గొడవలు, కొట్లాటలు మాత్రమే పెరుగుతాయి. అందుకే మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. అర్థం చేసుకోండి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved