Relationship: మీ భార్య నిత్యం కోపంగా ఉంటుందా.. అయితే మీరు ఇలా ప్రవర్తించాల్సిందే?
Relationship: సాధారణంగా భార్యలు కోప్పడరు, కానీ కోపం వచ్చిందంటే మాత్రం అంత త్వరగా శాంతించరు. అలాంటప్పుడు భర్తలు కూడా రెచ్చిపోకుండా ఈ విధంగా ప్రవర్తిస్తే భార్యలు శాంతిస్తారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఒక గొడవ జరిగినప్పుడు భార్యలు దానిని అంతా త్వరగా ముగించరు. వారికి తెలియవలసిన కారణం తెలిసినంత వరకు వారి కోపం చల్లారనంతవరకు వాళ్ల ఆవేశాన్ని వెళ్లగక్కుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఒక మంచి భర్తగా మీరు చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మీ భార్య కోపంతో మీ మీద కేకలు వేస్తున్నప్పుడు మీరు కూడా ఆమె మీద కోపంతో కేకలు వేయకండి. అది సమస్యని మరింత పెంచుతుంది. మీరు ప్రశాంతంగా ఉండి ఆమెని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఆమె కోపానికి కారణం తెలుసుకొని వీలైతే క్షమాపణ చెప్పండి.
ఆడవాళ్ళ కోపానికి ఒక్కొక్కసారి కారణం ఉండకపోవచ్చు. వాళ్ళ హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా కోపం వస్తుంది. ఆ సమయంలో వారు ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ మాటలని సీరియస్ గా తీసుకొని గొడవని మరింత పెంచకండి. ఆమె శాంతించిన తర్వాత ఆమె మాటలలో తప్పుని ఆమెకి తెలియచెప్పండి.
మీరు ఆమెని బుజ్జగించి దగ్గరకి తీసుకోవటం వలన ఆమెలో కోపం తగ్గడమే కాకుండా తన ప్రవర్తన పట్ల ఆమె పశ్చాతాపానికి కూడా గురవుతుంది. ఆమె కోపంలో ఉన్నప్పుడు ఒక భర్తగా మీరు చేయకూడని ఒక ముఖ్యమైన పని అక్కడ నుంచి వెళ్లిపోవడం. అది ఆమెని మరింత కోపానికి గురిచేస్తుంది.
కోపంలో ఆమె మాటలని మీరు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆమె చెప్పలేని తన బాధని కోపంలో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళగకుతుంది. అప్పుడు మీ లోపాన్ని మీరు సరి చేసుకున్న వారు అవుతారు. ఆమె ఆవేశంతో కేకలు వేస్తున్నప్పుడు కాసేపు ప్రశాంతంగా ఆమెని వదిలేయండి.
శాంతించిన తరువాత కోపానికి కారణం తెలుసుకోండి. ఆమె త్వరగా మామూలు స్థితికి రావడం కోసం ఆమెని నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లి, నచ్చినవి కొని ఇవ్వండి. మీ జీవితంలో ఆమె చాలా ముఖ్యం అని ఆమెకి తెలియ చెప్పండి.