MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • భార్యతో గొడవ తర్వాత ఇవి మాత్రం చేయకండి

భార్యతో గొడవ తర్వాత ఇవి మాత్రం చేయకండి

భార్యాభర్తలన్నాక గొడవపడటం చాలా సహజం. కానీ ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేస్తే భార్యా లేదా భర్తకు విపరీతంగా కోపం వస్తుంది. అలాగే మీ మధ్య మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే గొడవ తర్వాత ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 26 2024, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పెళ్లాం మొగుడి మధ్య  గొడవలు, కొట్లాటలు చాలా కామన్. ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతుంటాయి. సర్దుమనుగుతుంటాయి. ఇక ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకోరు. ఒకరి ముఖాలను ఒకరు చూసుకోరు. కానీ సగం పూటో లేదా ఒక్కరోజు తర్వాత మళ్లీ బాగా మాట్లాడుకుంటారు. అయితే గొడవ జరిగిన తర్వాత తెలిసో తెలియకో చేసే కొన్ని పనుల వల్ల మీరిద్దరూ మళ్లీ గొడవ పడే అవకాశం ఉంది. అందుకే మీరు గొడవ పడ్డ తర్వాత చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

24

దేనివల్ల గొడవ

కొట్లాట ఇక్కడితో ఆపేయాలనుకుంటే మాత్రం అసలు మీ గొడవ దేనివల్ల మొదలైందో దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడకండి. ముఖ్యంగా మీరే తప్పు చేసి ఉంటే. దీనివల్ల మళ్లీ గొడవ మొదలవుతుంది. గొడవ ఎక్కడ మొదలైందో తెలుసుకుని సయోధ్య గురించి ఆలోచిస్తే పొరపాటే. ఎందుకంటే ఇది కొన్ని కొన్ని సార్లు భాగస్వామి కోపాన్ని మరింత పెంచుతుంది.
 

34

రాజీపడినట్టు నటించడం

మీరు గొడవను సర్దుబాటు చేయాలనుకుంటే మాత్రం నాదే తప్పైందని మాత్రం నటించకండి. ఎందుకంటే ఒక్కోసారి విపరీతమైన భావోద్వేగాలు బయటకు వచ్చి ఆ తర్వాత దానిపై గొడవ పడొచ్చు. ఒకవేళ తప్పు మీది అయితే దానిని సులభంగా అంగీకరించండి. క్షమించమని అడగండి. ఏది ఏమైనా పరిస్థితులను అర్థం చేసుకుని గొడవను ముగించడానికి ప్రయత్నించండి. కానీ చాలా మంది జంటలు రాజీపడుతున్నట్టు నటిస్తారు. ఇది మీ రిలేషన్ షిప్ కు అంత మంచిది కాదు.  మీ భాగస్వామితో మీకు ఏదైనా సమస్య ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుని పరిష్కరించుకోండి. 
 

44

తొందరపడకండి

గొడవను పరిష్కరించడానికి తొందరపడటం సరికాదు. ఏదైనా ఒక విషయంపై వాదోపవాదాలు జరిగితే భాగస్వామి మనసు చల్లబడే అవకాశం ఇవ్వండి. మాట్లాడుకుని గొడవను పరిష్కరించే మార్గాన్ని వెతకండి. దీని కోసం మంచి అవకాశం కోసం వెయిట్ చేయండి. కోపంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేరు. ఇలాంటి సమయంలో మంచి విషయం కూడా చెడుగా అనిపిస్తుంది. గొడవ జరిగిన తర్వాత ఒకరినొకరు కాసేపు ఒంటరిగా వదిలేసి తిట్టడం మానుకోండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship Tips: భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!
Recommended image2
Relationship: సోషల్ మీడియా భార్యా భర్తల మధ్య చిచ్చు పెడుతోందా? నిపుణుల మాట ఇదే!
Recommended image3
వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved