MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • అబ్బాయిలు తమకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటారో తెలుసా?

అబ్బాయిలు తమకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటారో తెలుసా?

అమ్మాయిలైతే తమకు కాబోయే భర్త ఎత్తుగా ఉండాలి. అందంగా ఉండాలి. ఫిట్ గా ఉండాలి. నన్ను బాగా చూసుకోవాలి.. అర్థం చేసుకోవాలని ఎన్నో అనుకుంటూ ఉంటారు. మరి అబ్బాయిలు తమకు కాబోయే భార్య ఎలా ఉండాలి అనుకుంటారో తెలుసుకుందాం పదండి.
 

Shivaleela Rajamoni | Published : Nov 24 2023, 01:52 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

అమ్మాయిలే కాదు.. అబ్బాయిలకు కూడా తమకు కాబోయే భార్యల గురించి కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ చాలా మంది కేవలం అమ్మాయిలే కాబోయే భర్త ఇలా ఉండాలి? అలా ఉండాలని అనుకుంటారని.. అబ్బాయిలకు అలాంటివేమీ ఉండవని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి అమ్మాయిలు కాబోయే భర్త గురించి ఎలా అయితే అనుకుంటారో.. అబ్బాయిలు కూడా కాబోయే భార్యలో కొన్ని క్వాలిటీస్ ఉండాలని భావిస్తారట. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత మహిళ భార్యగానే కాకుండా.. పిల్లలకు తల్లిగా, జీవితంలో ప్రతి మంచి, చెడు విషయాలలో మీ భాగస్వామిగా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు కాబోయే భార్యలో ఏం ఆశిస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. .
 

26
Relationship stages

Relationship stages

ప్రేమ

అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా కాబోయే భార్యలో తమపై ఎనలేని ప్రేమను చూపాలని ఆశిస్తారట. తనపట్ల , తన కుటుంబం, ఇతరుల పట్ల ఎంతో ఆప్యాయంగా తనకు కాబోయే భార్య ఉండాలని కోరకుంటారు. అబ్బాయిలకు దయగా, సౌమ్యంగా ఉండే అమ్మాలంటే ఎంతో ఇష్టం. ఇలాంటి వారిని ఎంతో మెచ్చుకుంటారు. ఆడవారు తమకు బాధైనప్పుడు ఎవరైనా వాళ్లను గట్టిగా పట్టుకోవాలని ఎలా అయితే కోరుకుంటారో.. పురుషులు కూడా స్పర్శను ఎక్కువగా ఇష్టపడతారు. ఇది వారి భార్యల నుంచి ఎక్కువగా ఆశిస్తారు. ముఖ్యంగా ముద్దు పెట్టే భార్య లేదా చేతులను పట్టుకునే భార్య రావాలని కోరుకుంటారట. ఆప్యాయతలున్న అమ్మాయిలంటే పురుషులకు ఎక్కుడ లేని ఇష్టం. 
 

36
Asianet Image

స్వతంత్రంగా

కాలంతో పాటుగా మనుషుల అలవాట్లు కూడా మారాయి. ఒకప్పటిలా ఎవరూ ఆలోచించడం లేదు. పురుషులు కూడా తమకు కాబోయే భార్యలు స్వతంత్రంగా, పనిచేయాలని కోరుకుంటారు. అది చిన్నదైనా కావొచ్చు. పెద్దదైనా కావొచ్చు. ఎవ్వరిమీద ఆధారపడకుండా పనులను పూర్తి చేసే సామర్థ్యం తమకు కాబోయే భార్యలో ఉండాలని పురుషులు ఆశపడతారట. జస్ట్ ఇంటిపనులను మాత్రమే చేసే అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలని కోరకోరట. అబ్బాయిలకు ఫైనాన్షియల్ విషయాల్లోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా తమ భార్య సలహాలు ఇవ్వాలని ఆశపడతారట. ముఖ్యంగా తనను తాను హ్యాండిల్ చేసే సామర్థ్యమున్న ఆడవారిని పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు. 

46
Asianet Image

సపోర్టివ్

ఏ పనైనా సరే సపోర్టింగ్ చాలా అవసరం. అది అమ్మాయికైనా.. అబ్బాయికైనా.. అందుకే తమకు కాబోయే భార్య వాళ్లు చేసే ప్రతి పనిలో సపోర్టింగ్ గా ఉండాలని కోరుకుంటారట. జాబ్ పోయినప్పుడు లేదా పరిస్థితులు తలకిందులుగా మారినప్పుడు తట్టుకొని నిలబడటం ఎంతో కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పురుషులు తమ సహనాన్ని కోల్పోకుండా ఉండేందుకు తన భార్య సహాకారం ఉండాలని పురుషులు ఆశపడతారట. 

56
Asianet Image

సరదాగా,  సాహసోపేతంగా

వైవాహిక జీవితాన్ని బోరింగ్ గా మార్చే అమ్మాయితో ఉండాలని ఎవరూ కోరకోరు. పెళ్లి చేసుకునే అమ్మాయిల్లో అబ్బాయిలు ఆశించే మరొక ముఖ్యమైన విషయం సరదాగా, నవ్వేంచేలా ఉండాలని. అలాగే కాబోయే భార్య సాహసోపేతంగా ఉండాలని కూడా అబ్బాయిలు కోరుకుంటారు. కొందరి పురుషుల అభిప్రాయం ప్రకారం.. తమకు కాబోయే భార్య జోకులు వేసేలా ఉండాలి. అలాగే వేసిన జోకులను తీసుకోగలగాలి. అన్నింటికీ సిద్దంగా ఉండాలి. 

66
Asianet Image

సెక్స్ లో 

తమకు కాబోయే భార్య నుంచి ఆశించే మరొక ముఖ్యమైన విషయం ఇది. సెక్స్ ను పురుషులు ఎక్కువగా ఆస్వాధిస్తారు. అందులోనూ ఇది రిలేషన్ షిప్ కు చాలా చాలా అవసరం. అందుకే తమకు కాబోయే భార్య కూడా సెక్స్ ను మరింత ఆస్వాధించాలని, తమతో సంతోషకరమైన లైంగిక జీవితాన్ని గడపాలని కోరుకుంటారట. 
 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories