MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship Tips: గృహశాంతి కోసం అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిందేంటో తెలుసా? ఈ సూత్రాలే మీ ఇంటికి శ్రీరామరక్ష

Relationship Tips: గృహశాంతి కోసం అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిందేంటో తెలుసా? ఈ సూత్రాలే మీ ఇంటికి శ్రీరామరక్ష

Relationship Tips: అత్తాకోడళ్లు సంతోషంగా ఉంటే, ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. మామూలుగా అత్తాకోడళ్లు అంటే గొడవలు, విభేదాలే గుర్తొస్తాయి. కొంచెం ఓర్పు ఉంటే బంధం అందమైన స్నేహంగా మారుతుంది. గృహశాంతి కోసం వీరిద్దరి మధ్య ఉండాల్సిన ముఖ్యమైన విషయాలేంటో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : May 07 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అత్తాకోడళ్ల బంధం ఎలా ఉండాలంటే..
Image Credit : freepik

అత్తాకోడళ్ల బంధం ఎలా ఉండాలంటే..

ఒక ఇంటికి అత్తా కోడళ్లు రెండు కళ్ల లాంటి వారు. సాధారణంగా సమాజంలో "అత్తాకోడళ్ల బంధం" అనగానే మన కళ్ల ముందు మెదిలేవి సీరియల్ గొడవలు, యుద్ధాలు. కానీ, నిజానికి వీరిద్దరు సఖ్యంగా ఉంటే ఆ ఇల్లు దేవాలయంలా మారుతుంది. ఇద్దరి మధ్య గొడవలను కూడా మార్చుకుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే.. అది ప్రపంచంలోనే అత్యంత బలమైన బంధంగా మారుతుంది. గృహశాంతిని పెంపొందిస్తూ, అత్తాకోడళ్ల మధ్య అనుబంధాన్ని పెంచే ఆ 'సీక్రెట్' సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. పరస్పర గౌరవం (Mutual Respect)
Image Credit : gemini ai

1. పరస్పర గౌరవం (Mutual Respect)

అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన మొదటి, అతి ముఖ్యమైన సూత్రం 'గౌరవం'. వయసులో పెద్దవారైన అత్తగారి అనుభవాన్ని కోడలు గౌరవించాలి. అలాగే, కొత్తగా ఇంటికి వచ్చిన కోడలి వ్యక్తిత్వాన్ని, ఆమె చదువును, ఆలోచనలను అత్తగారు గౌరవించాలి. ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడటం మానేస్తే గొడవలకు తావుండదు. 

37
2. వ్యక్తిగత స్వేచ్ఛ (Healthy Boundaries)
Image Credit : AU Generated Photo

2. వ్యక్తిగత స్వేచ్ఛ (Healthy Boundaries)

ప్రతి మనిషికి కొంత 'పర్సనల్ స్పేస్' అవసరం. కోడలు తన పుట్టింటి వారితో మాట్లాడటం, తనకిష్టమైన పని చేయడం వంటి విషయాల్లో అత్తగారు జోక్యం చేసుకోకూడదు. అదే సమయంలో, ఇంటి సంప్రదాయాలను గౌరవిస్తూ కోడలు నడుచుకోవాలి. ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు అనవసరంగా తలదూర్చకుండా ఉండటమే హెల్తీ రిలేషన్ షిప్. 

47
3. పోలికలు వద్దు (Avoid Comparisons)
Image Credit : gemini ai

3. పోలికలు వద్దు (Avoid Comparisons)

చాలా గొడవలకు మూలం పోలికలు. "మా కోడలు ఇలా ఉంది, పక్కింటి కోడలు అలా ఉంది" అని అత్తగారు కానీ.. "మా అమ్మ ఇలా చేసేది, మీరు ఇలా చేస్తున్నారు" అని కోడలు కానీ పోల్చి మాట్లాడకూడదు. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా ఆమోదించడం నేర్చుకోవాలి.

57
4. కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించాలి
Image Credit : Freepik

4. కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించాలి

మనసులో ఏదైనా బాధ ఉంటే దానిని నేరుగా చెప్పుకోవడం ఉత్తమం. అలా కాకుండా మూడవ వ్యక్తికి అంటే భర్తకు లేదా ఇరుగుపొరుగు వారికి) చెప్పడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం మానేసి, కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. 

67
5. అంచనాలను తగ్గించుకోవడం
Image Credit : chatgpt

5. అంచనాలను తగ్గించుకోవడం

అత్తగారు తన కోడలు అన్ని పనులు చేసేయాలని ఆశించకూడదు. అలాగే కోడలు కూడా తన అత్తగారు తనను అచ్చం అమ్మలాగే చూసుకోవాలని మొదటి రోజే అనుకోకూడదు. బంధం బలపడటానికి సమయం పడుతుంది. అంచనాలు తక్కువగా ఉన్నప్పుడు నిరాశ తక్కువగా ఉంటుంది.

77
6. భర్త/కొడుకు పాత్ర
Image Credit : chatgpt

6. భర్త/కొడుకు పాత్ర

ఇంట్లో మగవాడి పాత్ర చాలా కీలకం. ఇద్దరిలో ఎవరికీ పక్షపాతం చూపకుండా, మధ్యవర్తిగా ఉంటూ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించాలి. ఒకరి మాటలు మరొకరికి తప్పుగా చేరవేయకుండా జాగ్రత్త పడాలి.

అత్తాకోడళ్లు అంటే రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు. వారి మధ్య అభిప్రాయ భేదాలు సహజం. కానీ, "ఈ ఇల్లు మనది, అందరం కలిసి ఉండాలి" అనే స్పృహ ఉంటే గృహశాంతి దానంతట అదే వస్తుంది. అత్తగారు తన కోడలిని కూతురిలా, కోడలు తన అత్తగారిని తల్లిలా భావించకపోయినా పర్వాలేదు కానీ.. ఒక స్నేహితురాలిలా గౌరవిస్తే చాలు, ఆ సంసారం స్వర్గమే.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంధుత్వం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Related Stories
Recommended image1
Relationship Tips: రిలేషన్ షిప్‌లో ఈ 3 తప్పులు చేశారంటే.. బంధం తెగిపోవడం ఖాయం!
Recommended image2
Relationship: 90 శాతం మందికి ప్రేమ‌కు అస‌లైన‌ అర్థం ఏంటో తెలియ‌దు.. మీకు తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved