దంపతుల మధ్య ఇలాంటి సంకేతాలు.. కలిసి ఉండటం కష్టమే..!
దంపతుల మధ్య బేధాభిప్రాయలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది..? అసలు ఏలా దంపతులు ఉండకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నతం చేద్దాం..
అన్ని బందాల్లో కెల్లా.. భార్యభర్తల బంధం గొప్పగా.. ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే.. ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేకుండా.. వీరు కేవలం పెళ్లి అనే ముడితో.. వివాహ బంధంలోకి అడుగుపెడతారు. అలాంటి దంపతులు.. వెంటనే ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు.
couple fight
అయితే... కొందరికి మాత్రం కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా..కనీసం వారి మధ్య సక్యత ఉండదు. ఎవరు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కనీసం తెలుసుకోలేరు. అలాంటి సంకేతాలు ఉంటే మాత్రం.. అలాంటివారు కలిసి ఉండటం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
couple fight
ఎలాంటి సంకేతాలు.. దంపతుల మధ్య బేధాభిప్రాయలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది..? అసలు ఏలా దంపతులు ఉండకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నతం చేద్దాం..
couple fight
చాలా మంది మంచి ఆహారం తీసుకుంటున్నా కూడా.. మనిషి చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఓపిక లేనట్లుగానే ఉంటారు. వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.మనిషి ఎండిపోయినట్లుగా ఉంటారు. దానికి కారణమేంటో తెలుసా..? వారికి కనీసం తిన్న ఆహారం ఒంటికి పట్టడం లేదని అర్థం. వారు మనసు ప్రశాంతంగా లేదని అర్థం. అందుకే తిన్న ఆహారం వంటికి పట్టక.. అలా ఎండిపోతున్నారని అర్థమట.
ఇక వైవాహిక జీవితంలో ఆనందంగా లేకుండా.. మంచి బంధంలో లేనివారు.. ఎప్పుడూ కోపంగా.. భయంగా ఉంటారు. దీంతో.. వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఆ కోపంలోనే తీసుకుంటారు. దీంతో.. అవన్నీ తప్పుడు నిర్ణయాలుగా మరే ప్రమాదం ఉంది.
మీరు సరైన పార్ట్ నర్ తో కలిసి లేరు అనడానికి మరో ఉదాహరణ ఏంటంటే.. ప్రతి విషయంలో మిమ్మల్ని తక్కువగా చేసి చూస్తారు. మీకు ఏదీ చేత కాదంటూ అందరి ముందూ తక్కువ చేస్తారు. మీ భావాలకు గౌరవం ఇవ్వరు. దీంతో... ఆ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక నిస్సహాయితకు గురౌతారు.
couple fight
ఇక చాలా మందిని తమ పార్ట్ నర్స్ డామినేట్ చేస్తుంటారు. ఏ విషయంలోనూ కనీసం ఆలోచించే స్వాతంత్రం కూడా ఇవ్వరు. దీంతో.. పార్ట్ నర్ ని చూస్తేనే భయంతో వణికిపోతుంటారు. ఇలాంటి బంధాన్ని వదలుకోవడమే మంచిదని నిపుణణులు సూచిస్తున్నారు. లేదా.. మార్చుకునే ప్రయత్నం చేయాలి.