మీ భర్తతో ఇలాంటి విషయాలను అన్నారంటే గొడవలొచ్చేస్తాయ్
భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ప్రతి విషయాన్నిషేర్ చేసుకోవాలంటారు. కానీ కొన్ని విషయాలను మాత్రం భాగస్వామితో అస్సలు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి మీ ఇద్దరి మధ్య గొడవలను కలిగిస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ప్రతి విషయాన్నిషేర్ చేసుకోవాలంటారు. కానీ కొన్ని విషయాలను మాత్రం భాగస్వామితో అస్సలు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి మీ ఇద్దరి మధ్య గొడవలను కలిగిస్తాయి.
ఎలాంటి రిలేషన్ షిప్ అయినా సరే కమ్యూనికేషన్ చాలా చాలా అవసరం. కానీ చాలా మంది భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. ఇదే ఎన్నో సమస్యలకు, గొడవలకు కారణమవుతుంది. కొన్ని కొన్ని సార్లు మీరు చెప్పిన విషయాలను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు కోప్పడి తర్వాత మీకు క్షమాపణలు చెప్పొచ్చు.
అయితే మీరు చెప్పే కొన్ని విషయాలు మీ భాగస్వామి భావాలు, విశ్వాసం, ఆత్మగౌరవంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇవి మీ మధ్య గొడవలను కలిగిస్తాయి. మీరు విడిపోయేలా కూడా చేస్తాయి. అందుకే మీ భాగస్వామికి ఎలాంటి విషయాలను చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వేరొకరితో పోల్చకండి
మీ భాగస్వామిని వేరోకరితో పోల్చడం, మిమ్మల్ని అవతలి వాళ్లతో పోల్చుకోవడం మానుకోండి. ముఖ్యంగా మీతో మంచిగా లేని వ్యక్తితో. ఇలా పోల్చడం వల్ల మీ భాగస్వామి హార్ట్ అవుతారు. అలాగే వారి భావాలను దెబ్బతీసిన వారవుతారు. ఇలా మీరు వేరొకరితో పోల్చుతున్నారంటే.. మీరు మీ భాగస్వామిని ప్రశంసించడం లేదని, వాళ్ల నుంచి మీరు కొన్ని ఆశిస్తున్నారని అర్థం వస్తుంది. అందుకే మీ భాగస్వామిని ఎట్టి పరిస్థితిలో పోల్చకండి. బదులుగా వారి సామర్థ్యం, మంచి లక్షణాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. వారికి అండగా ఉండండి.
ఎప్పటికీ చేయరు.. మీరు మారరు
మీ భాగస్వామితో అనకూడదని మాటలు కూడా ఉన్నాయి. అంటే "మీరు అప్పటి నుంచి ఇలాగే ఉన్నారు" లేదా "మీరు అది ఎప్పటికీ ఇలా చేయరు" వంటి పదాలను అస్సలు అనకండి. మీ భాగస్వామి తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయాన్ని మీరు గమనించకపోయి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఈ మాటలు అంటే వారికి కోపం వస్తుంది. అలాగే గొడవలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీ భాగస్వామి బాధపడతారు.
నన్ను ప్రేమిస్తున్నట్టైతే ఇలా చేయాల్సిందే
మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా? అయితే మీరు ఇలా చేయాల్సిందే.. వంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకండి. ఇది మీ సంబంధంలో నమ్మకాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఇలా మాట్లాడితే మీ భాగస్వామి ఆలోచనలను, కోరికలను మీరు గౌరవించడం లేదని అర్థం వస్తుంది. అలాగే మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని కూడా అర్థమొస్తుంది. షరతులతో కూడిన ప్రేమను మీ బంధాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మీ భాగస్వామి కోరికలను గౌరవించండి.
relationship
మొండివాడు
మీరు మంచి వారు కాదు, మొండివారు వంటి విషయాలను అస్సలు అనకండి. ఇలాంటి వాటిని అనుకోకుండా అన్నా మీ భాగస్వామి భావాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి మాటలు అంటే.. మీ భాగస్వామి మారాలని కోరుకుంటున్నట్టు అర్థమొస్తుంది. కానీ దీనివల్ల మీ భాగస్వామి బాధపడతారు. అలాగే మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా వస్తాయి.
ఏం చేసినా సరే
భాగస్వామితో గొడవపడ్డప్పుడు చాలా మంది భార్యలు మీరు ‘ఏం చేసినా సరే’ అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఇది మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేసినటట్టు అనిపించొచ్చు లేదా వారి ఆలోచనలు, భావాలు మీకు ముఖ్యం కాదని అనిపించొచ్చు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ ను కలిగిస్తుంది. అలాగే మీరు కలిసి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకోలేరు. అందుకే ఇలాంటి మాటలు అనకండి. మీ భాగస్వామి మాట్లాడేటప్పుడు వినండి.