Relationship: మీరు అత్తగారితో అన్ని విషయాలు చెబుతున్నారా.. జాగ్రత్త, బంధం బలహీనపడవచ్చు!
Relationship: కొంతమంది కోడళ్ళు తల్లితో కన్నా ఎక్కువగా అత్తగారితోనే అన్యోన్యంగా ఉంటూ కష్టసుఖాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే అన్ని విషయాలు అత్తగారితో చెప్పడం కూడా ప్రమాదమే అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ అదేమిటో చూద్దాం.
సాధారణంగా అత్తా,కోడలు అనగానే కొట్లాటలు, గొడవలు, అసూయ, ద్వేషాలు మాత్రమే గుర్తుకు వస్తాయి చాలా కుటుంబాలలో. కానీ అందుకు భిన్నంగా చాలామంది అత్తా కోడళ్లు ఎంతో అన్యోన్యంగా ఉంటూ చూసేవారికి ఆదర్శంగా కనిపిస్తారు. ఆ కోడలు తల్లి దగ్గర కన్నా అత్తగారి దగ్గర ఎక్కువ కంఫర్ట్ పొందుతూ కష్టసుఖాలు షేర్ చేసుకుంటూ ఉంటారు.
అక్కడి వరకు బాగానే ఉంది కానీ ప్రతి విషయాన్ని అత్తగారితో చెప్పటం అనర్థానికి దారితీస్తుంది అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. నిజమేనండి చాలా విషయాలు అత్తగారితో ఓపెన్ గా చెప్పకూడదంట అదేమిటో చూద్దాం.
మీ అత్తగారు మీకు వంట చేసే భోజనం పెట్టినప్పుడు ఆ వంట నచ్చకపోయినా కూడా కాస్త ఎడ్జస్ట్ అవ్వండి అంతేకానీ వంట బాగోలేదు అని చెప్పకండి. అది ఆవిడని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తుంది. అలాగే కుటుంబ గౌరవాన్ని తగ్గించేలా పుట్టింటి గొప్పలు చెప్పడం మానుకోండి.
అలాగే భర్తతో జరిగిన సంభాషణ సంసార విషయాలు చాలా మటుకు అత్తగారికి చెప్పకండి. మీరు మీ అత్తగారి మీద అభిమానంతో చెప్తారు కానీ ఆ విషయాలు ఆ నోట, ఈ నోట పాకి సంసారానికే ముప్పు రావచ్చు. అలాగే అత్తగారు ఎంత బాగా చూసుకుంటున్నా తల్లిని చులకన చేస్తూ అత్తగారి దగ్గర మాట్లాడకూడదు.
ఈ మాటలు తల్లి దగ్గరికి ఏ రూపంగా నేను వెళ్తే మీ తల్లి కూతుర్ల బంధం బలహీనపడే పరిస్థితి వస్తుంది. అలాగే పెద్దరికం కొద్ది అత్తగారు మీకు జాగ్రత్తలు చెప్పటం కానీ వారి యొక్క అనుభవాన్ని చెప్పడం గాని జరిగినప్పుడు ఆవిడ దగ్గర అసహనాన్ని ప్రదర్శించకండి.
సందర్భానుసారంగా ఏదో ఒక సాకు చెప్పి మంచిగా అక్కడ నుంచి తప్పించుకోండి. అలా అని అత్తగారి దగ్గర ప్రతి విషయాన్ని దాచకండి ఎందుకంటే అనుభవంతో ఆవిడ ఇచ్చే సలహాలు మీ సంసారాన్ని నిలబెడతాయి. కాబట్టి లౌక్యంగా వ్యవహరించి అత్తగారి దగ్గర మంచి పేరు సంపాదించుకోండి.