Relationship Tips: భార్య ఈ ఒక్క తప్పు చేసినా.. భర్తతో గొడవలు తప్పవు..!
Relationship Tips: చిన్న చిన్న అపార్థాలే దంపతుల మధ్య దూరం పెరగడానికి కారణం అవుతాయి. మరీ ముఖ్యంగా భార్య చేసే చిన్న తప్పు కూడా వారి మధ్య గొడవలు రావడానికి కారణం అవుతాయి.

relationship tips
దాంపత్య జీవితం సవ్యంగా సాగాలి అంటే... వారి మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం చాలా అవసరం. ఈ మూడింటిలో ఏది లోపించినా దంపతుల మధ్య సంబంధం తెగిపోతుంది. చిన్న చిన్న అపార్థాలే దంపతుల మధ్య దూరం పెరగడానికి కారణం అవుతాయి. మరీ ముఖ్యంగా భార్య చేసే చిన్న తప్పు కూడా వారి మధ్య గొడవలు రావడానికి కారణం అవుతాయి. మరి... భార్యలు ఎలాంటి తప్పు చేయకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
మౌనంగా ఉండటం కూడా తప్పేనా..?
చాలా మంది మహిళలు అన్ని విషయాల్లో మౌనం వహిస్తారు. తమ మనసులో ఉంది అనే విషయాన్ని తొందరగా బయట పెట్టరు. దీని కారణంగా వారి అవసరాలు, అంచనాలు భర్తకు ఎలా తెలుస్తాయి..? తెలియకపోవడం వల్ల వారికి నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులు మీకు నచ్చకపోవచ్చు. ఫలితంగా.. దంపతుల మధ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. అన్ని విషయాల్లో మౌనంగా ఉండకపోవడమే మంచిది. మీకు ఏం కావాలో మీరే స్వయంగా చెప్పాలి. మహిళలు మౌనంగా ఉండి, మౌనంగా వ్యవహరించినప్పుడు, అది సంబంధంలో అసంతృప్తికి , ఆగ్రహం పెరగడానికి దారితీస్తుంది, ఇది ఉద్రిక్తతకు , సంఘర్షణకు దారితీస్తుంది. అంతేకాదు, మహిళలు తమ భావాలను వ్యక్తపరచలేనప్పుడు, అది వారికి , వారి జీవిత భాగస్వామికి మధ్య దూరాన్ని సృష్టిస్తుంది. తర్వాత విడాకుల దాకా దారితీయవచ్చు.
నిపుణుల అభిప్రాయం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారి మనస్సులో ఏదైనా ఉంటే, భార్యాభర్తలు ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవాలి. మౌనం సంబంధాన్ని నాశనం చేస్తుంది. వెంటనే చెప్పాలని అనిపించకపోయినా.. కొంచెం సమయం తీసుకొని అయినా... మీ మనసులో విషయాలను వివరించాలి.