Relationship Tips: భర్త దగ్గర భార్య ఈ విషయాలు దాచకూడదు..!
Relationship Tips: చాలా మంది మహిళలు.. తమ భర్తకు తెలియకుండా చాలా విషయాలను దాచిపెడుతూ ఉంటారు. దీని వల్ల ఇద్దరి మధ్య తేడాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలు దాచితేనే బంధం బలంగా ఉంటే.. కొన్ని దాచకపోతేనే బంధం బాగుంటుంది.

Relationship Tips
భార్యభర్తల మధ్య సంబంధం చాలా విలువైనది. వారి బంధం బలంగా ఉండాలంటే.. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. మరీ ముఖ్యంగా... భార్య... తన భర్త దగ్గర కొన్ని విషయాలను పొరపాటున కూడా దాచకూడదు. చాలా మంది మహిళలు.. తమ భర్తకు తెలియకుండా చాలా విషయాలను దాచిపెడుతూ ఉంటారు. దీని వల్ల ఇద్దరి మధ్య తేడాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలు దాచితేనే బంధం బలంగా ఉంటే.. కొన్ని దాచకపోతేనే బంధం బాగుంటుంది. మరి... వేటిని దాచకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం....
మీ భర్త నుంచి దాచకూడని విషయాలు....
డబ్బు వ్యవహారాలు...
భార్య తన జీతం, ఆదాయం వివరాలను తన భర్త నుంచి ఎప్పుడూ దాచకూడదు. మరీ ముఖ్యంగా... మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా.... మీరు ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకున్నా ఈ విషయాలను కచ్చితంగా పంచుకోవాలి. డబ్బు విషయంలో దాపరికాలు ఉండకపోతేనే బంధం బాగుంటుంది.
ఆందోళనలు, భయాలు....
భార్య తన ఆందోళనలను తన భర్త నుండి దాచకూడదు, అంటే ఆమెకు ఏమి ఆందోళన కలిగిస్తుంది. ఎలాంటి విషయాలకు భయపడుతున్నారు అనే విషయాలను కచ్చితంగా చెప్పాలి. కొన్నిసార్లు పంచుకోవడం భయాన్ని తగ్గిస్తుంది. ఆందోళనను తొలగిస్తుంది. భార్య తన భర్త నుండి ఆరోగ్య సమస్యలను కూడా దాచకూడదు. మీకు అత్యవసర పరిస్థితి ఉంటే, మీ భర్త మీకు సపోర్ట్ గా నిలుస్తాడు. కాబట్టి, మీ ఆరోగ్య సమస్యలను అతని నుండి ఎప్పుడూ దాచకండి.
ఫీలింగ్స్...
భార్యలు తరచుగా తమ భావాలను తమలోనే ఉంచుకుంటారు. వాటిని తమ భర్తలతో పంచుకోరు, ఇది వారి సంబంధాన్ని బలహీనపరుస్తుంది. అలాంటి పరిస్థితులలో, భార్యలు ఖచ్చితంగా తమ భర్తలతో తమ భావాలను పంచుకోవాలి, తద్వారా వారు అర్థం చేసుకుంటారు. మహిళలు ఎవరికైనా భయపడితే లేదా బెదిరింపులకు గురైతే, మీ భర్త నుండి అలాంటి విషయాలను దాచవద్దు. ఇది తరువాత సమస్యలను కలిగిస్తుంది.
ఇష్టాయిష్టాలు...
కొంతమంది మహిళలు తమ ఇష్టాయిష్టాలను తమ భర్తలతో పంచుకోరు. మీకు ఏది ఇష్టమో, ఏది కష్టమో చెప్పకపోతే... మీకు నచ్చినట్లుగా మీ భర్త ఉండకపోవచ్చు. కాబట్టి... మీ ఇష్టాలను, కష్టాలను వారితో పంచుకోవడం మంచిది.