Relationship: మీ భాగస్వామి తరుచుగా అబద్ధాలు చెప్తున్నారా.. అయితే కారణం ఇదే?
Relationship: ఇద్దరు దంపతుల మధ్య చిన్ని చిన్ని అబద్ధాలు ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఎదుటి వ్యక్తిని మోసం చేసే స్థాయి అబద్ధాలు చెప్పారంటే కారణం ఏమై ఉంటుంది తెలుసుకుందాం రండి.
ఏ బంధాలైనా నమ్మకం పైనే నిలబడతాయి ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగాలంటే దాపరికాలకి అబద్దాలకి తావు ఉండకూడదు. ఒక అబద్ధం స్వచ్ఛమైన బంధం ముక్కలైపోవటానికి కారణం కావచ్చు.అయితే మీ పార్ట్నర్ చెప్పిన ప్రతి అబద్ధము మిమ్మల్ని మోసం చేయటానికే కాకపోవచ్చు.
వారు పడుతున్న టెన్షన్ మీరు పడకూడదని మీకు అబద్ధం చెప్పి ఉండవచ్చు. అందువలన ప్రతి అబద్ధాన్ని అనుమానించకుండా సూక్ష్మంగా పరిశీలిస్తే అందులో ఉన్న నిజా నిజాలు బయటికి వస్తాయి. మనలో చాలామంది భార్యలు భర్తలు రెగ్యులర్గా ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అని సింపుల్ గా ఒక మాట చెప్తారు.
కానీ చాలాసార్లు ఈ మాట అబద్దమే అవుతుంది. ఈ చిన్ని అబద్ధం అవతలి వ్యక్తి మీద ఒక్కొక్కసారి నమ్మకాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. ఇలాంటి చిన్ని చిన్ని అబద్ధాలు కాకుండా జీవితాన్ని నాశనం చేసే అబద్ధాలు ఉంటాయి. వాటిని మాత్రం ఉపేక్షించడానికి వీలు లేదు.
మీ భాగస్వామి మీతో ప్రతిరోజు అబద్ధం చెప్తున్నారంటే కచ్చితంగా మీ మీద శ్రద్ధ తగ్గినట్టే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవటానికి ఇష్టపడకపోవడం ఒక కారణమై ఉంటుంది లేదా మీ పై ఆసక్తి తగ్గిపోయి ఇతరులపై మోజు పెరిగినప్పుడు కూడా మీకు దూరంగా ఉండడం కారణాలు అడిగితే అబద్ధాలు చెప్పటం జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఇలాంటి వాటి మీద ఒకసారి దృష్టి పెట్టండి. ఇక ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ భాగస్వామి మీకు అబద్ధం చెప్తుంటే అది కూడా మీ మీద అభిమానంతో అయి ఉండవచ్చు ఎందుకంటే హార్దికపరమైన టెన్షన్స్ మనిషిని ఎంత చికాకు పెడతాయో..ఆ చీకాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అబద్ధం చెప్పి ఉండవచ్చు ఒకసారి ఆలోచించండి .
అయితే అబద్ధం ఏదైనా అబద్ధమే నీ పార్ట్నర్ ని సేవ్ చేయటం కోసమే మీరు అబద్ధం చెప్పినా అవతల వ్యక్తి అర్థం చేసుకోకపోతే అది అపార్ధాలకి దారితీస్తుంది. అందుకే వీలైనంత మటుకు నిజాన్ని నిదానంగా అయినా చెప్పటానికి ప్రయత్నించండి. మీ బంధాన్ని కాపాడుకోండి.