Relationship: మోసం చేసిన జీవిత భాగస్వామి పై పగ తీర్చుకోకండి.. ఎందుకంటే!
Relationship: బంధం కలకాలం నిలబడాలని ఆశిస్తాం కానీ కొందరి భాగస్వాముల మోసం వలన బంధంవిచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో చాలామంది భాగస్వామి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. అదేమిటో చూద్దాం.
ఎన్నో ఆశలతో, కోరికలతో వివాహ బంధంలో అడుగుపెడతారు దంపతులు. కొన్ని రోజులు సజావుగా సాగిన ఆ సంసారంలో కలతలు రావడం ప్రారంభమైతే అది ఎంతో బాధని మిగులుస్తుంది. అదే సమయంలో జీవిత భాగస్వామి మోసం చేశాడు అని తెలుసుకుంటే ఆ బాధ వర్ణనాతీతం.
అలాంటి సమయంలో చాలామంది భాగస్వామి మీద కక్ష తీర్చుకోవాలని బాధ చల్లార్చుకోవాలని అనుకుంటారు. కానీ అలా చేయడం చాలా తప్పు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. ఎప్పుడూ భాగస్వామి మీద కక్ష తీర్చుకోవాలి అనుకోవడం మంచి పద్ధతి కాదు.
ఎందుకంటే దానివల్ల మీ బాధ ఏమాత్రం తీరదు సరి కదా బంధం పూర్తిగా తెగిపోయే అవకాశం ఉంటుంది. ముందుగా అతను అలా ఎందుకు చేశాడు అని పూర్వపరాలు పరిశీలించండి. ఒక్కొక్కసారి చేసిన మోసంలో ఎదుటి వాళ్ళ తప్పు ఉండకపోవచ్చు.
ఒకసారి పాజిటివ్ గా ఆలోచించండి. ఇంకా పరిస్థితి చేదాటి పోతే భాగస్వామిని నిలదీయండి. ఇలా చేయడం వలన నిజా నిజాలు బయటికి వస్తాయి. బంధంలో అఇష్టత వల్ల అతను మిమ్మల్ని మోసం చేసినట్లయితే మీ పట్ల అతను ఎందుకు నిరాశక్తిని కలిగి ఉన్నాడో తెలుసుకోండి.
అతను ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని మోసం చేసినట్లు తెలిస్తే ముందుగా క్షమించడానికి ప్రయత్నించండి లేని పక్షంలో అతనికి మరొక అవకాశం ఇచ్చి చూడండి. ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ అతను తన మోసపూరిత బుద్ధిని మార్చుకోకపోతే..
మీ యొక్క బంధం అతనికి అవసరం లేదేమో ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళ మీద కక్ష సాధించి మీ భవిష్యత్తుని పాడు చేసుకోకండి. ఇప్పుడు మీరు చేయవలసిన తక్షణ కర్తవ్యం మీ భవిష్యత్ ప్రణాళిక మాత్రమే అని గుర్తుంచుకొని అడుగు ముందుకు వేయండి.