Relationship: అతిగా ఆలోచించకండి.. అవి మీ సంబంధాలను విచ్చిన్నం చేయగలవు!
Relationship: మనిషికి ఆలోచన అవసరమే కానీ అతిగా ఆలోచించటం వలన మంచి జరగదు సరి కదా ఆ స్థానంలో చెడు జరిగే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు ఒక్కొక్కసారి మీ బంధాలు విచ్ఛిన్నం కూడా కాగలవు అందుకే అతిగా ఆలోచిస్తే వచ్చే అనర్ధాలు ఏమిటో చూద్దాం.
నిజానికి ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పాజిటివ్ థింకింగ్, రెండు నెగటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ లో ఉండేవాడు జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకుని పైకి ఎదుగుతాడు.
కానీ నెగటివ్ థింకింగ్ ఉన్నవాడు హద్దులు దాటి ఆలోచనలతో వ్యసనాలకి బానిసై అతిగా ఆలోచిస్తూ బంధాలని విచ్ఛిన్నం ఉంటాడు. అయితే ఇలా అతిగా ఆలోచించటం అటు మానసికంగానూ, ఇటు శారీరకంగా కూడా చాలా ప్రమాదాలను తీసుకువస్తుంది.
ఈ ఓవర్ థింకింగ్ తో మనం మాట్లాడే చిన్న చిన్న మాటలు, కాన్వర్సేషన్స్ కూడా సంబంధాలు చెడిపోయే అంత ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఎక్కువగా ఆలోచించేవారు ఆభద్రతాభావానికి లోనై జీవిస్తూ ఉంటారు.
వీరు తమ సంబంధాలు నాశనం అయిపోతాయేమో అనే అభద్రతతోనే జీవిస్తారు. బంధాన్ని నిలబెట్టుకోవాలని అతి జాగ్రత్తలో వేసే తప్పటడుగులు అవతలి వ్యక్తికి ఇబ్బందిగా అనిపిస్తాయి. భాగస్వామి సమయానికి ఫోన్ చేయకపోయినా, సమయానికి ఇంటికి రాకపోయినా వీళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి.
కానీ అవతల వాళ్ళకి ఉండే కారణాలు వాళ్లకు ఉంటాయి. కానీ వీళ్ళ ఓవర్ థింకింగ్ తో ఎదుటివాళ్లని అనుమానిస్తూ చికాకు తెప్పిస్తారు. భాగస్వాములు చేసే చిన్న పనులను కూడా భూతద్దంలో చూస్తూ అతిగా ఆలోచనలో ఆపడతారు అదే విషయంగా భాగస్వాములని నిలదీస్తారు కూడా. అయితే ఎలాంటి తప్పు చేయని భాగస్వామికి ఇదంతా చికాకు కలుగజేస్తుంది.
అలాగే జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా ఏదో పెద్ద అనర్థం జరిగిపోతున్నట్లుగా ఆలోచించుకొని భాగస్వామితో మరింత తప్పుగా ప్రవర్తిస్తారు. కాబట్టి ముందుగా బంధం మీద అభద్రతా భావాన్ని వదిలేయండి. అది బంధాన్ని బలపరచడం మాట పక్కన పెడితే విచ్ఛిన్నం కావడానికి కారణం అవుతుంది.