ఆగండి పెళ్లికి అప్పుడే ఓకే చెప్పకండి.. వీటిలో క్లియర్ గా ఉన్నారేమో చెక్ చేసుకోండి
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని మధురమైన అనుభూతి. పెళ్లితో మునపటి లైఫ్ ఇక ఉండదు. భాగస్వామితో నిండు నూరేళ్లు గడపాల్సి ఉంటుంది. అయితే పెళ్లిపీఠలెక్కే ముందు మీకు మీరే కొన్ని ప్రశ్నలను వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తర్వాత ఇబ్బంది పడతారు.
మ్యారేజ్
లవ్ మ్యారేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అరెంజ్డ్ మ్యారేజ్ లో ఎన్నో తంతులు ఉంటాయి. అబ్బాయి లేదా అమ్మాయి నచ్చాలి. వాళ్ల ఫ్యామిలీ నచ్చాలి. ఆస్తుపాస్తులు నచ్చాలి? ముఖ్యంగా అబ్బాయి వాళ్లకు లేదా అమ్మాయి వాళ్లకు వధూవరులు గుణగణాలు నచ్చాలి. పెద్దల కుదుర్చిన పెళ్లిలో ఇలా ఎన్నో ఉంటాయి. అయితే చాలా మంది పెద్దలు అబ్బాయి లేదా అబ్బాయిని నచ్చాడా ? అని అడగడం చాలా సహజం. ఏమీ చెప్పకపోతే వారంలో చెప్పాలి అన్న కండీషన్ కూడా పెడుతుంటారు. కానీ జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం కేవలం నిమిషాల్లో తీసుకోవడం కష్టం. ఏదేమైనా పెళ్లీ మీ మునపటి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే మీరు ఏ మాత్రం తప్పటడుగు వేసినా.. ఫ్యూచర్ లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు పెళ్లికి ముందు మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో క్లియర్ గా ఉంటేనే అప్పుడు ఓకే చెప్పండి.
మ్యారేజ్
మీరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా?
ఇది చాలా పెద్ద ప్రశ్నే. చాలా ఇది చాలా అవసరం. పెద్దలు ఓకే చేశారు కదా అని పెళ్లికి ఒప్పుకుంటే మీరు ముందు సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే మీకు మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న ‘నేను పెళ్లికి సిద్దంగానే ఉన్నానా’ అని అడుక్కోండి. అంతేకాదు మిమ్మల్ని మాత్రమే కాదు మిమ్మల్ని చేసుకోబోయే వారిని కూడా ఈ ప్రశ్న అడగండి. కానీ మీరు ఇందుకు సిద్దంగా లేకున్నా పెళ్లి చేసుకుంటే మాత్రం తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఈ ప్రశ్నకు మీ మనస్సే సమాధానం చెప్తుంది. అలాగే పెళ్లిపై ఉన్న గందరగోళం కూడా పూర్తిగా తొలగిపోతుంది.
మ్యారేజ్
అవతలి వ్యక్తితో జీవితాన్ని గడపొచ్చా?
మీరు పెళ్లికి సిద్దమే అని అనుకున్నప్పుడు మీకు ఎంతో రిలీఫ్ కలుగుతుంది. ఇక ఆ తర్వాత మిమ్మల్ని మీరు అడగాల్సిన రెండో ప్రశ్న.. మీతో పెళ్లికి సిద్దమైన వ్యక్తితో మీ శేష జీవితాన్ని గడపగలరా. వాళ్లతో కలిసి కలకాలం ఆనందంగా ఉంటారని అని. అయితే స్టార్టింగ్ లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సంతోషాన్నిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒకరి అలవాట్లను మరొకరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే మీ భాగస్వామికి ఏది ఇష్టం, ఏది ఇష్టముండదు వంటి విషయాల్లో మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. మీ అలవాట్లు కూడా వాళ్లకు తెలిస్తాయి. కానీ వీటికి మీ భాగస్వామి ఎలా స్పందిస్తారనేది ముఖ్యం. అందుకే చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేయకుండా వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
Marriage
రిలేషన్షిప్ లో ఏం కోరుకుంటున్నారు?
లవ్ ఫెయిల్యూర్ అయ్యి.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లను చేసుకోవడానికి సిద్ధమైన వారు కూడా ఉంటారు. మీకు ఇలాంటి పెళ్లి సంబంధం కూడా రావొచ్చు. కానీ వీళ్లను మీరు రిలేషన్ షిప్ ఏం కావాలనుకుంటున్నారో ముందే అడగండి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కాబోయే భాగస్వాముల గురించి ఎన్నో కలలు కంటుంటాం. అందుకే మొదటి చూపులోనే ఎవరితోనైనా మాట్లాడి అవును అని చెప్పే ముందు.. ఈ సంబంధం నుంచి మీరు కోరుకున్నది లభిస్తుందో? లేదో? తెలుసుకోండి.
marriage
బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
పెళ్లి చేసుకోవడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలిగించొచ్చు కూడా. ఎందుకంటే జీవితంలో పెళ్లి ఎంతో స్పెషల్ మరి. కానీ పెళ్లి తర్వాత మీ బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కొత్త కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్దంగా ఉండాలి. ఎందుకంటే పెళ్లితో పాటుగా మీపై ఎన్నో బాధ్యతలు పడతాయి. కుటుంబం, పిల్లలు, భర్త, సమాజం ఇలా ఎన్నో బాధ్యతలను మీరు నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న మీరొక్కరే కాదు.. మీ భాగస్వామిని కూడా అగడండి. మీరిద్దరూ ఒక్కటిగా ఉండి ఇంటి నిర్వహణ నుంచి పిల్లల వరకు బాధ్యతలను నిర్వహించగలరా? లేదో? తెలుసుకోండి. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు, మీ కెరీర్ లక్ష్యాలు, ప్రణాళికలు, భవిష్యత్తు గురించి కూడా ప్రశ్నలు అడగడం మర్చిపోకండి. ఈ విషయాలు పెళ్లి కాకముందే మీ భాగస్వామికి తెలిస్తే మీ వైవాహిక బంధాన్ని కొనసాగించడం, నిర్వహించడం సులువవుతుంది.