ఈ నియమాలను పాటిస్తే దాంపత్య బంధం బలంగా మారుతుంది.. అవి ఏంటంటే?
స్త్రీ, పురుషులిద్దరూ పెళ్లికి ముందు నుంచి దాంపత్య జీవితం గురించి అలా ఉండాలి, ఇలా ఉండాలని ఇలా ఎన్నో కలలు కంటారు. కానీ నిజజీవితంలో వారు అనుకున్న విధంగా ఉండదు.
Relationship Goals
పెళ్లయిన కొత్తలో దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. కొన్నాళ్లకు కుటుంబ బాధ్యతలు పెరగడంతో దంపతులిద్దరిపై బాధ్యత పెరిగి ఇద్దరి మధ్య ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది అపార్థాలకు దారితీస్తుంది. దీంతో వారు కలలు కన్న అందమైన దాంపత్య జీవితం కొన్నాళ్లు కూడా సాఫీగా జరగదు. మరీ దాంపత్య జీవితం (Married life) బాగుండాలంటే దంపతులిద్దరూ పాటించవలసిన నియమాల (Rules) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం ఉండదు. ఒకరికొకరు వారి అభిప్రాయాలను (Opinions) వ్యక్తపరచుకుంటూ గౌరవించుకోవాలి. భాగస్వామి చెప్పే అభిప్రాయాలను చులకనగా చూడరాదు. దంపతులిద్దరూ ఇతరుల ముందు గొడవపడుతూ ఒకరినొకరు కించపరచుకోరాదు. భాగస్వామి గౌరవమే తన గౌరవంగా భావించి ఒకరికొకరు ఎంతో ఆప్యాయంగా (Affectionately) ఉండాలి.
ఒకరికొకరు మంచి స్నేహితుల్లా ఉంటూ దాపరికాలు (Candids) లేకుండా చూసుకోవాలి. అనేక బాధ్యతలు నిర్వహించే ఇల్లాలు భర్త నుంచి ప్రేమను ఓదార్పును (Consolation) కోరుకుంటుంది. ఇలా అన్ని కష్టసుఖాలలోనూ భర్త తోడుగా ఉంటే భార్యకు అంతకుమించిన అదృష్టం మరొకటి లేదు. అలాగే భర్త విషయంలో కూడా భార్య ఇలానే ప్రవర్తిస్తే భార్యపై భర్తకు మరింత ప్రేమ పెరుగుతుంది. దీంతో వారి దాంపత్య జీవితం మరింత బలంగా మారుతుంది.
భర్త ఏ కారణం చేతనైన భార్యపై కోప్పడినప్పుడు ఆ కోపానికి (Anger) గల కారణాన్ని భార్య అర్థం చేసుకోవాలి. ఎక్కువగా ఆలోచించి భర్తను అపార్థం (Misunderstanding) చేసుకోరాదు. ఆఫీసు ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమవుతున్న భర్తను అనేక ప్రశ్నలతో విసగించకుండా ఆ ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటిలో ప్రశాంత వాతావరణన్ని కల్పించాలి. భర్తకు ఇష్టమైన ఆహార పదార్థాలను వండడం, ఇష్టమైన పనులను చేస్తే తనపై మీకున్న ప్రేమను అర్థం చేసుకుంటారు.
అలాగే భార్యకు ఇల్లు, సంసారం అతి పెద్ద బాధ్యత. ఈ పనులను నిర్వర్తించడంలో ఒక్కోసారి అలసటకు (Fatigue) గురవుతారు. దీంతో భర్తపై విసుగుచెందుతారు. భర్త ఆమె ప్రవర్తనకు గల కారణాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. భర్త తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా భార్యకు ఇంటి పనులలో సహాయం చేస్తే ఆమెకు పని ఒత్తిడిని (Stress) తగ్గించగలరు. అలాగే భార్యకు చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం, సరదాగా తనకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం చేసే ఆమె సంతోషిస్తుంది.
ఎన్ని పనులు ఉన్నా దంపతులిద్దరూ కలిసి సరదాగా ఏకాంతంగా గడపడానికి రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. ఇలా చేస్తే ఇద్దరి మధ్య బంధం (Bond) మరింత బలపడుతుంది. దాంపత్య జీవితంలో ఇద్దరూ బాధ్యతగా ఉండాలి. ఇరువురి కుటుంబ సభ్యులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారిని గౌరవించాలి. అలాగే ఎన్ని ఇబ్బందులు (Difficulties) ఎదురైనా దంపతులిద్దరూ కలిసి వాటిని అధిగమించి విజయంవైపు అడుగులు వేయాలి. ఇలా చేస్తే దాంపత్య జీవితం బలంగా మారుతుంది.