Relationship: మీ బాయ్ ఫ్రెండ్ చెప్పిన మాట వినటం లేదా.. అయితే ఈ చిట్కాలతో మీ కొంగున కట్టేసుకోండి?
Relationship: సాధారణంగా ఏ బంధంలో అయినా ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య మాట తేడా వస్తుంది. ఆ మాట ఒక్కొక్కసారి బంధం విచ్చిన్నం అయ్యే పరిస్థితి వరకు వెళ్తుంది అలా కాకుండా ఉండాలంటే మీరు ఈ చిట్కాలు పాటించండి.
మీ బాయ్ ఫ్రెండ్ మీ మాట వినటం లేదా.. మీకు ప్రతికూలంగా మాట్లాడుతున్నారా.. అయితే మీరు కూడా ఆవేశపడకండి అప్పుడు మరింత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. నిజంగా ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలని కోరిక మీ మనసులో ఉంటే కొంచెం ఓపిక పట్టండి. కొంచెం సహనాన్ని ప్రదర్శించండి.
దాంతోపాటు ఈ చిట్కాలు కూడా పాటించండి. మీ బాయ్ ఫ్రెండ్ కచ్చితంగా మీ కొంగుపట్టుకొని తిరగడం ఖాయం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందు అతనికి మీరంటే ఎంత ఇష్టమో తెలియజెప్పండి. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనే విషయం అతనికి తెలిసేలాగా చేయండి.
అతను కోప్పడుతున్నప్పుడు మీరు కూడా వెంటనే కోప్పడకుండా ప్రశాంతంగా ఉండండి. కాసేపటి తర్వాత కచ్చితంగా పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు విషయాన్ని గురించి చర్చించండి. అలాగే తెలివితేటలు ఉన్న అమ్మాయిలని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారని గ్రహించండి.
విషయం మీద అవగాహన లేకుండా మాటలు ప్రారంభించకండి. అవగాహన లేకుండా ఒక విషయం మీద మాట్లాడటం వలన అవతల వారి వద్ద మీరు చులకన అవుతారు. అలాగే పరిస్థితులని బట్టి నడుచుకోవడం ప్రారంభించండి.
మీరు మీ అభిప్రాయాన్ని గాని, మరి ఏదైనా విషయాన్ని అతనితో చెప్పాలనుకున్నప్పుడు ముందుగా అతని యొక్క మూడ్ ఎలా ఉంది అన్నది గమనించండి. అవసరమైతే విషయం చెప్పటాన్ని పోస్ట్పోన్ చేయండి.
అంతేకానీ మీకు మూడ్ వచ్చింది కదా అని సంభాషణ ప్రారంభిస్తే మొదటికే మోసం వస్తుంది. అలాగే మీ బాయ్ ఫ్రెండ్ యొక్క అవసరాలు తెలుసుకుని అతనికి అవసరాలు తీరుస్తూ ఉండటం వల్ల మీ ప్రవర్తనికి అతను ఇంప్రెస్ అవుతాడు. అప్పుడు కచ్చితంగా మీకు కొంగు పట్టుకుని తిరుగుతాడు.