ఆలుమగల మధ్య ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే వారి మధ్య బంధం ఎలా ఉంటుందో తెలుసా?
వివాహబంధంతో ఒక్కటైన జంట వారి మధ్య కొన్ని మార్పులను చేర్చుకుంటే వారి బంధం మరింత బలంగా మారుతుంది. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వివాహం తర్వాత తమ అభిరుచులని (Tastes), అలవాట్లని (Habits), ఆసక్తులను పక్కన పెట్టేస్తున్నారు.
తమ జీవితంలో ఏదో కోల్పోయామనే అసంతృప్తితో జీవిస్తున్నారు. కనుక ఆలుమగలు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే వారి మధ్య అసంతృప్తి భావన అనేదే ఉండదు. తమ మధ్య కొన్ని మార్పులు చేసుకుంటే ప్రేమ మరింత పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది వివాహ జీవితంలో (Married life) తమ అభిరుచుల్ని, అలవాట్లని, ఆసక్తులను భాగస్వామితో పంచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇలా అసంతృప్తి (Dissatisfaction) భావనతో తమ వివాహ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇది వారి బంధంలో ఒక లోపంగా మారుతుంది. దీంతో వారి మధ్య ప్రేమ బంధం తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఆలుమగలు ఇద్దరూ కలిసి తమ వివాహ జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే తమ మధ్య బంధం బలపడి జీవిత ప్రయాణం సుఖమయం అవుతుంది.
వివాహ బంధంలో ఎప్పుడు నా అనే స్వార్థం (Selfishness) ఉండకూడదు. ఎంత సేపు తమ గురించే ఆలోచించడం మంచిది కాదు. భాగస్వామి అభిరుచులు, ఆలోచనలు పంచుకోగలిగితే మీ అనుబంధం (attachment) మరింత సంతోషంగా మారుతుంది. మీ మధ్య ప్రేమ బంధం మరింత పెరుగుతుంది.
చదువు, ఉద్యోగం, ఆలోచనా విధానంలో మీ భాగస్వామి మీ కంటే కింద ఉంటే వారి లోపాలను (Errors) ఎత్తి చూపే ప్రయత్నం చేయరాదు. వారిని నలుగురిలో చులకనగా చూడరాదు. భాగస్వామి గౌరవమే మీ గౌరవంగా భావించి తన అభిప్రాయాలనూ (Views) గౌరవించాలి. అప్పుడే మీ భాగస్వామికి మీ మీద మరింత ప్రేమ పెరుగుతుంది.
భాగస్వామి చేసే ఏ చిన్న పనినైనా తక్కువ చేసి చూడకుండా తనను ప్రోత్సహిస్తే (Encouraged) మీ భాగస్వామికి మీ మీద నమ్మకం (Believe) అనేది ఏర్పడుతుంది. మీకు ఎంత పని ఒత్తిడి (Stress) ఉన్నా మీ భాగస్వామితో కొంత సమయాన్ని ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించాలి. ఎదుటివారు మీ మనస్సును తెలుసుకొని సంతోష పెట్టాలి అని ఆలోచించడం పొరపాటు.
మీరే మీ మనసులోని ఆలోచనలను (Ideas) స్వయంగా పంచుకునే ప్రయత్నం చేయాలి. మీ మనసులో భాగస్వామిపై ఉన్న ప్రేమను (Love) ఎప్పటికప్పుడు కొత్తగా తెలియపరచడానికి ప్రయత్నించాలి. మీ వైవాహిక జీవితాన్ని కొత్తగా మలుచుకునేందుకు ఇద్దరూ కలిసి తమ వంతు ప్రయత్నం చేయాలి.
అన్ని బాధ్యతలను ఇద్దరూ సమానంగా (Equally) పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నీకు నేను తోడుగా (Companion) ఉన్నాను అనే భావనను కల్పించుకోవాలి. ఈ మార్పులను మీ వైవాహిక జీవితంలో అలవరచుకుంటే మీ మధ్య బంధం మరింత బలపడుతుంది.