Relationship: నెట్టింట్లో గడుపుతున్న భాగస్వామిపై ఓ కన్నేయండి.. లేదంటే మీతో రిలేషన్ కి రెడ్ సిగ్నలే!
Relationship: చాలామంది సోషల్ మీడియాలో మునిగిపోయి తమ భాగస్వాముల గురించి పట్టించుకోరు. అయితే అలాంటి భాగస్వాములపై ఓ కన్నెయ్యమంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. లేదంటే మీతో రిలేషన్ షిప్ డేంజర్ లో పడినట్లే. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈమధ్య నెలల పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. అలా గడపకపోయిన వాళ్ళని ఏదో వింత జంతువుని చూస్తున్నట్లుగా కూడా చూస్తున్నారు.అయితే భాగస్వాములని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా..
మరీ సోషల్ మీడియాలో గడుపుతున్నారు అంటే అలాంటి వాళ్ల గురించి కాస్త ఆలోచించవలసిందే, వాళ్ల మీద ఓ కన్నెయ్యాల్సిందే. అలాంటి డేంజర్ సిగ్నల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ భాగస్వామి తన సోషల్ అకౌంట్లో సింగిల్ అని స్టేటస్ పెట్టుకున్నట్లైతే అది డేంజర్ సిగ్నల్ గా భావించాలి.
ఎందుకంటే మ్యారీడ్ అని పెట్టుకుంటే చాలా మంది ఫాలో అవ్వరని సింగిల్ అని పెట్టుకుంటారు. అలాగే తరచూ ఓకే ఎకౌంట్ ని పదేపదే చూస్తున్నారంటే అది కూడా డేంజర్ సిగ్నల్ గా భావించాలి. అలాగే తమ అకౌంట్ ని మనం ఫాలో అవుదాం అన్నా కూడా ఒప్పుకోరు చాలామంది.
ఇది కూడా డేంజర్ సిగ్నల్. అలాగే వాళ్ళ స్టేటస్లు పెట్టుకునేటప్పుడు మనల్ని ప్రైవేట్ లో పెట్టారు అంటే అది కూడా డేంజర్ సిగ్నల్ ని సూచిస్తుంది. అలాగే ఇతరుల పోస్టులకి రొమాంటిక్ గా రిప్లై లు ఇస్తున్నట్లయితే వాళ్లని ఒక కంట కనిపెట్టడం చాలా అవసరం.
ఎందుకంటే ఇలాంటి వాళ్లు ఒక అడుగు ముందుకు వేసి అక్రమ సంబంధాలకి తెరతీయటంలో కూడా ముందుంటారు. అలాగే తమ ఎక్స్ లవర్స్ లేదా ఎక్స్ లైఫ్ పార్ట్నర్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటున్నారు అంటే అది కూడా డేంజర్ సిగ్నల్ గా భావించాలి.
అలాంటి వాళ్ళని కంట్రోల్లో ఉంచి మనం జాగ్రత్త పడటం ఎంతో అవసరం. లేదంటే వాళ్ళతో ఉండే మన రిలేషన్ డేంజర్ లో పడటం ఖాయం అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.