Relationship: మాజీ ప్రేమికులని మరిచిపోలేకపోతున్నారా.. అయితే ఇలా ఓసారి ప్రయత్నించండి?
Relationship: ప్రేమ అది ఒక మంచి అనుభూతి. ప్రేమించినప్పుడు బానే ఉంటుంది కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తీరని వ్యధని మిగులుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ గత జ్ఞాపకాలు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఈ చిట్కాలు పాటించండి.
మనం గాఢంగా ప్రేమించిన వ్యక్తులని పరిస్థితుల కారణంగా వదులుకోవాల్సి రావటం, వాళ్లని మర్చిపోవడం అనేది కష్టతరమైన పని. అలా అని వాళ్ళ ఆలోచనలతోనే ఉండిపోతే మన జీవితం మధ్యలోనే ఆగిపోతుంది. అక్కర్లేని గతాన్ని మర్చిపోవడం కోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. మొట్టమొదట మీరు చేయవలసిన పని నిజాన్ని గ్రహించడం. ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయటం.
నిజానికి ఇలా చేయటానికి మీ హృదయం సిద్ధంగా ఉండకపోవచ్చు. కానీ నిజాన్ని అంగీకరించడం ద్వారా కాలక్రమేణా మనసు గతాన్ని మర్చిపోతుంది. జరిగిన ఘటనని తలుచుకొని ఏడుస్తూ కూర్చోకండి. అది మిమ్మల్ని మరింత వ్యధకు గురిచేస్తుంది. మీ భవిష్యత్తుని చీకటిమయం చేస్తుంది.
మిమ్మల్ని వ్యసనానికి బానిసలుగా కూడా తయారు చేయవచ్చు. కాబట్టి మనసుని దృఢపరుచుకొని భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. మన జీవితం ఆ ఒక్క వ్యక్తితోనే ముడి పడిపోయిందని, అతను లేకపోతే జీవితం లేదు అనే ఆలోచన నుంచి బయటికి రండి.
మనసు గత జ్ఞాపకాలతో అలసిపోతుంది అనిపించినప్పుడు మీ యొక్క ఇష్టాల మీద అభిరుచుల మీద దృష్టి పెట్టండి. మీయొక్క భవిష్యత్తుకి బాటలు వేసే ప్రయత్నాలు ప్రారంభించండి. ఒక వ్యక్తిని మర్చిపోవటానికి ఉత్తమ మార్గం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ని ముందుగా మీ ఫోన్ నుంచి డిలీట్ చేయండి.
మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అతని ప్రస్తావన తీసుకురాకుండా ఉండేలాగా మీ ప్రవర్తన దృఢంగా ఉండాలి. గతానికి సంబంధించిన ఏ జ్ఞాపకాన్ని మీ దగ్గర ఉండకుండా జాగ్రత్త పడండి. ఏ ఒక్క జ్ఞాపకం మీ దగ్గర ఉన్నా.. అది మిమ్మల్ని గతంలోకి తీసుకువెళ్లి మిమ్మల్ని మరింత బాధపడుతుందని గుర్తించండి.
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీ మనసు మాయాపేటిక కాదు. ఇలా అంటే అలా గతం మర్చిపోవటానికి. మన ప్రయత్నం తోనే మర్చిపోవాలి అనే విషయాన్ని గ్రహించండి. మీ భవిష్యత్తు మిమ్మల్ని వదులుకున్న లేదంటే మీరు వదులుకున్న వ్యక్తికి అందనంత ఎత్తులో నిర్మించుకోవడం మీ చేతుల్లోనే ఉందని గ్రహించండి.