Relationship: బంధం దూరమవుతుందని బాధపడుతున్నారా.. అయితే ఇలా ప్రయత్నించి చూడండి?
Relationship: మన భాగస్వామి కారణం తెలియకుండా మనకి దూరం అవుతుంటే ఆ బాధ భరించలేనిది. బాధపడకుండా ఈ విధంగా ప్రయత్నిస్తే ఎలాంటి బంధాన్ని అయినా దగ్గర చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం.
మీరు మీ భాగస్వాములకు ఎక్కువగా దూరమవుతున్నారా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్న సరే ఆ ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదా అయితే ఇవి వినండి. మనం ప్రయత్నిస్తున్న సరే దగ్గర అవ్వలేకపోతున్నాము అంటే తప్పు మనలో లేదు మనం ప్రయత్నించే విధానంలో ఉన్నది.
Image: Getty
ఇద్దరు భాగస్వాములు దూరంగా ఉన్నంత మాత్రాన దూరం పెరిగిపోదు అలాగే దగ్గరగా ఉన్నంత మాత్రాన బంధాలు చివరి వరకు ఉండవు కనుక బంధాలు చివరి వరకు ఉండాలంటే మనం మనసు విప్పి మాట్లాడాలి. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి.
వాళ్ల వాళ్లకు ఇష్టమైన పనులు చేయాలి ఒకరినొకరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్లకి మన మీద నమ్మకం ఏర్పడుతుంది. మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నా అది మనసులోనే ఉంచుకుంటే అది వాళ్లకు తెలియదు.
మనం బయటకు చెప్తేనే వాళ్ళకి కూడా ఆ బంధం విలువ తెలిసి వాళ్ళ ప్రేమను కూడా మనకు చెప్తారు. ఇలాంటి అప్పుడే ప్రేమ ఎదుగుతుంది. కష్టాల్లో ఒకరికొకరు ఎప్పుడుతోడుగా ఉండాలి. ఎంత కష్టాన్ని అయినా ప్రేమతో జయించవచ్చు. ఇద్దరూ కలిసున్న సమయంలో ఇద్దరికీ నచ్చిన పనులు చేస్తూ ఉండాలి.
ఎక్కువగా గిఫ్ట్లు తెచ్చి ఎదుటి వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటే ప్రతిరోజు ఫోన్లో వీడియో కాల్ లో మాట్లాడుతూ తగినంత సమయం గడపాలి దానికంటూ వారానికి ఒక షెడ్యూల్ వేసుకొని మనసు విప్పి మాట్లాడాలి.
వారమంతా వాళ్ళ వాళ్ళ పనులలో అలసిపోయినప్పుడు వీకెండ్ ఎక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేసి హాయిగా జీవితాన్ని గడపాలి ఒకరి దగ్గర మరొకరు సంతోషాన్ని వెతుక్కోవాలి ఒకరి దగ్గర ఇంకొకరు నమ్మకాన్ని బలపరుచుకోవాలి అలాంటప్పుడే ఏ బంధమైనా చివరిదాకా ఏ అడ్డంకులు లేకుండా ఉంటుంది.