నీకు హ్యాపీనే.. ఆమె తృప్తి సంగతేంటి..? స్త్రీ భావప్రాప్తికి అంత సమయమా?
49 శాతం మంది భార్యలు మాత్రమే లైంగిక ప్రక్రియలో సంత్రుప్తికరంగా భావప్రాప్తి పొందుతున్నామని పేర్కొన్నారు. భార్యల భావప్రాప్తి పట్ల భర్తలు తప్పుడు అవగాహన కలిగి ఉన్నారని కూడా తేలింది.
భార్యభర్తల శృంగార జీవితం ఎంత చక్కగా ఉంటే.. వారి మిగితా లైఫ్ కూడా అంతే ఆనందంగా ఉంటుందనేది నిపుణులు వాదన. ఆ శృంగారం జీవితంలో ఒకరిపై మరొకరికి అనుమానాలు ఉండకూడదు.
ముఖ్యంగా భావప్రాప్తి విషయంలో చాలా మంది పురుషులకు వారి భార్యలపై కాస్త అనుమానం ఉంటుంది. తన భార్య భావిప్రాప్తి పొందిందా లేదా..? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దీనిపై బ్రిగం యంగ్ యూనిర్శిటీ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అసలు చాలా మంది పురుషులు తమ భార్యలను నిజంగా తృప్తి చెందుతున్నారా లేదా అనే విషయం అసలు పట్టించుకోరట. కేవలం తమకు వీర్యం బయటకు వచ్చిందా లేదా.. తమకు తృప్తి దక్కిందా లేదా అనే విషయం గురించి కనీసం ఆరా కూడా తీయరట.
ఈ అంశంపై ఓ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వ్యక్తమయ్యాయి. దాదాపు 1,683 మంది నూతన దంపతుల నుంచి డేటా సేకరించారు. లైంగిక ప్రక్రియలో పాల్గొన్నప్పుడు జీవిత భాగస్వాముల మద్య భావప్రాప్తి, సంత్రుప్తి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆసక్తికర, ఆశ్చర్యకరమైన జవాబులు వచ్చాయి.
భర్తలతో పోలిస్తే భార్యల్లో భావప్రాప్తి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. 87 శాతం మంది భర్తలు లైంగిక ప్రక్రియ సమయంలో పొందుతున్న భావప్రాప్తిపై సంత్రుప్తికరంగా ఉన్నామని చెప్పారు.
కానీ 49 శాతం మంది భార్యలు మాత్రమే లైంగిక ప్రక్రియలో సంత్రుప్తికరంగా భావప్రాప్తి పొందుతున్నామని పేర్కొన్నారు. భార్యల భావప్రాప్తి పట్ల భర్తలు తప్పుడు అవగాహన కలిగి ఉన్నారని కూడా తేలింది.
43 శాతం మంది భర్తలు మాత్రం తమ భార్యలు భావప్రాప్తి పొందారా? లేదా? అన్న విషయం తెలుసుకోవడం కష్ట సాధ్యంగా మారిందని చెప్పారు. 25 శాతం మంది భర్తలు తమ జీవిత బాగస్వాముల గురించి పొరపాటు అభిప్రాయాలకు వచ్చామని చెప్పినట్లు తేలింది.
భార్యాభర్తల భావప్రాప్తిలో అంతరాయం ఏర్పడటం సహజ పరిణామమేనని పరిశోధకులు చెబుతున్నారు. వివాహమైన మహిళలు తమ భర్తల కంటే తక్కువగా భావప్రాప్తి పొందుతుంటారని బ్రిగం యంగ్ యూనివర్సిటీ అధ్యయనం రుజువు చేసింది.
భర్తలను తేలిగ్గా నమ్ముతారో ఆ భార్యాభర్తల మధ్య మాత్రమే భావప్రాప్తి సరిగ్గా సాగుతుందని తెలుస్తున్నది. పురుషులకు భావప్రాప్తి కలగడానికి ఒక్కోసారి తక్కువలో తక్కువ మూడు, నాలుగు నిమిషాలు కూడా పట్టదట.
అయితే... స్త్రీలలో మాత్రం అలా కుదరదని చెప్పారు. కొందరు స్త్రీలకు ఆరు నిమిషాల్లో తృప్తి దక్కగా.. మరికొందరికి చాలా ఆలస్యమౌతుందట.
అందుకే యావరేజ్ గా 13.41 నిమిషాల పాటు శృంగారంలో పాల్గొన్నప్పుడు మాత్రమే.. స్త్రీలకు ఆ కలయికను ఎంజాయ్ చేయలగలరట.
దాదాపు 20దేశాలకు చెందిన 645 మంది మహిళలపై ఈ సర్వేచేశారు. అందులో ఎక్కువమంది ఇండియా, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ కు చెందినవాళ్లే ఉన్నారు.
ఈ స్టడీలో ఎంచుకున్న అమ్మాయిల సగటు వయస్సు 30ఏళ్లు. అందరికీ పెళ్లి అయ్యింది. లేదా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అందరికీ ఓ టాస్క్ ఇచ్చి దీనికి కనిపెట్టడం గమనార్హం.
రొమాన్స్ సమయంలో స్టాప్ వాచ్ ను స్టార్ట్ చేసి, ఎప్పుడు సెక్సువల్ గా క్లైమాక్స్ చేరారో, ఎప్పుడు భావప్రాప్తి పొందారో నోట్ చేయమన్నారు. అంతా స్టడీకోసమన్నారు.
మొత్తం ఎనిమిది వారాల కాలంలో భావప్రాప్తి పొందడానికి పట్టేసమయం 12.56 నిమషాల నుంచి 14.06 నిమషాల వరకు ఉంటోంది.
ఇంకో సంగతి 17శాతం మందికి అసలు భావప్రాప్తే లేదంట. ఇక 68.6 శాతం మంది అమ్మాయిలకు పార్టనర్ కాస్తా చిలిపిగా, కొంతమొరటుగా బిహేవ్ చేస్తేకాని క్లైమాక్స్ చేరలేరంట.