ఆ డిప్రెషన్ తో శృంగారానికి దూరం..!
First Published Dec 25, 2020, 3:01 PM IST
వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారందరూ చాలా ఫ్రస్టేషన్ లో ఉంటున్నారట. దీనిని బట్టి.. ఎక్కువగా ఫ్రస్టేషన్ కి గురయ్యేవారిలోనే ఈ సమస్య తలెత్తుందని చెబుతున్నారు.

ఎలాంటి గర్భ నిరోధక విధానాలు అవలంబించకుండా సంవత్సరం పాటు కాపురం చేసినా... పిల్లలు కలగడం లేదు అంటే సమస్య ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య తలెత్తితే ఆలస్యం చేయకుండా సంబంధిత నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు డాక్టర్లు పరిశీలించి.. ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో చెక్ చేసి... అందుకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు.

కాగా.. ఈ మధ్యకాలంలో పురుషుల్లో వీర్యకణాల సమస్య విపరీతంగా వేధిస్తోందని ఓ సర్వేలో తేలింది. పురుషుల్లో లోపం విషయానికి వస్తే... వారిలో వీర్యకణాల సంఖ్య సరిపోను ఉండాలి. అంతేకాకుండా వాటి క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. ఒక్క స్ఖలనంలో కనీసం 20 మిలియన్ల వీర్యకణాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?