దాంపత్య జీవితంలో గౌరవం దక్కుతుందా?
మరి మీకు ఆ గౌరవం దక్కుతుందా లేదా? ఈ సంకేతాలతో ఆ విషయం తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ దాంపత్య బంధం సరిగా సాగుతుందో లేదో కూడా తెలుసుకోవచ్చు అదెలాగో ఓసారి చూద్దాం..
couple fight
దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చుకోవడం కూడా చాలా అవసరం. మరి మీకు ఆ గౌరవం దక్కుతుందా లేదా? ఈ సంకేతాలతో ఆ విషయం తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ దాంపత్య బంధం సరిగా సాగుతుందో లేదో కూడా తెలుసుకోవచ్చు అదెలాగో ఓసారి చూద్దాం..
1. మీ భాగస్వామి మీ ఫీల్సింగ్స్, మీ అవసరాలను పట్టించుకోవడం లేదు అంటే ఆ బంధం గురించి మీరు ఆలోచించాల్సిందే. ఇలా చేస్తున్నారంటే వారికి మీ మీద ఎలాంటి గౌరవం లేదు అని, మీకు, మీ ఆలోచనలు, ఫీలింగ్స్ కి విలువ ఇవ్వడం లేదు అని అర్థం.
2.మీరు ఎవరితోనైనా ఏదైన విషయం మాట్లాడుతుంటే మీ భాగస్వామి మిమ్మల్ని అడ్డుకోవడం లాంటివి చేస్తున్నారంటే మీ ఆలోచనలు, మీ మాటకు, మీ నిర్ణయానికి వారు సరైన గౌరవం ఇవ్వడం లేదని అర్థం.
3.మీ భాగస్వామి ప్రతి విషయంలో మిమ్మల్ని తేలికగా తీయడం, మానసికంగా మాటలతో బాధించడం చేస్తున్నారంటే మీ కు గౌరవం ఇవ్వడం లేదనే అర్థం, మీ వ్యక్తిత్వానికి, డిగ్నిటీని వారు గౌరవించడం లేదు.
4.ఎంత భార్యభర్తలైనా ఫిజికల్, ఎమోషనల్ గా కొన్ని బౌండరీస్ ఉంచుకోవాలి. వాటిని మీ భాగస్వామి పట్టించుకోవడం లేదు అంటే కూడా మీరు ఆలోచించాల్సిందే. ఇది కూడా వారికి మీ మీద గౌరవం లేదని చూపిస్తుంది.
5.మీరు ఎంత కష్టపడి విజయం సాధించినా, మీ భాగస్వామి గుర్తించడంలేదు అంటే కూడా ఆలోచించాల్సిందే. వారు మీ హార్డ్ వర్క్ ని వారు గౌరవించడం లేదు అని అర్థం.
6.మీ భాగస్వామి మీ బాధ్యతలను తీసుకోవడానికి ఇష్టపడటం లేదంటే కూడా వారికి మీ మీద ఎలాంటి గౌరవం లేదనే అర్థం. మీ ఫీలింగ్స్ ని పట్టించుకోవడంలేదంటే కూడా వారు మీకు గౌరవం ఇవ్వడం లేదని అర్థం.
7.మీ భాగస్వామి ఇంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ కూడా కనీసం మీ అభిప్రాయం తీసుకోవడం లేదు అంటే.. వారు మీకు గౌరవం ఇవ్వడం లేదనే అర్థం. వారు మీ అభిప్రాయాలను, నిర్ణయాలను పట్టించుకోవడం లేదని అర్థం. మీ బంధానికి వారు ఎలాంటి విలువ ఇవ్వడం లేదని అర్థం.