Couple: భార్యాభర్తలు ఇలా ఉంటే.. జీవితంలో విడాకులన్న మాటే రాదు.
ఇటీవలి కాలంలో జంటలు విడిపోవడం ఎక్కువుతోంది. అయితే ఎంతో గొప్ప బంధమైన దాంపత్య జీవితం కలకాలం సంతోషంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. అవేంటంటే..

అనుబంధం
భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే అనుబంధం ఉండాలి. అది కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉండాలి. ఒకరులేకపోతే మరొకరు ఉండలేమన్న భావనతో ఉంటే ఆ బంధాలు ఎప్పటికీ విడిపోవు. కలకాలం సంతోషంగా కలిసి ఉంటారు. ఎమోషనల్, ఫిజికల్, సైకాలజీ పరంగా కపుల్స్ కలిసిపోవాలి.
ఎమోషనల్ బాండింగ్
భార్యాభర్తల మధ్య కచ్చితంగా భావోద్వేగంతో కూడిన బాండింగ్ ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ బాగుండాలి. భాగస్వామికి ఏ విషయాన్ని అయినా చెప్పగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఇద్దరి మధ్య మనసులో మాటను నిరభ్యంతరంగా చెప్పుకునే హక్కు ఉండాలి.
పొగడ్తలు
భార్యను భర్త, భర్తను భార్య.. అప్పుడప్పుడు పొగడాలి. ఇలా చేస్తే వారి మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది. చిన్న చిన్న పొగడ్తలు చాలా ముఖ్యంగా. మీ భాగస్వామి పట్ల మీకు ఉన్న అభిమానం, ప్రాధాన్యత వారికి అర్థమయ్యేలా మాటలతో కంటే చేతలతో అర్థమయ్యేలా చేయాలి.
ఫిజికల్ ఇంటిమసి
ఫిజికల్ ఇంటిమసి అనగానే కేవలం శారీరక బంధమే కావాల్సిన పనిలేదు. మీ భాగస్వామి చేతిని ప్రేమతో పట్టుకోవడం కూడా. ఏదైనా కష్టం వచ్చిన సమయంలో భర్త చేతిని పట్టుకొని భార్య ధైర్యం చెప్పడం. సరదాగా భార్య చెంపను భర్త గిల్లడం, బుగ్గపై ముద్దు పెట్టడం లాంటివన్నీ ఫిజికల్ ఇంటిమసి కిందికి వస్తాయి.
సైకలాజికల్ ఇంటిమసి
ఒకే విషయం గురించి దంపతులు ఇద్దరు కలిసి మాట్లాడడాన్ని సైకలాజికల్ ఇంటిమసి అంటారు. ఉదాహరణకు ఒక పుస్తకాన్ని ఇద్దరు కలిసి చదవడం, ఒకే సినిమాను ఇద్దరు కలిసి చూడడం. కేవలం చూడడమే కాకుండా అందులోని విషయాల గురించి ఇద్దరు కలిసి చర్చించుకోవాలి. ఇలా చేయడం వల్ల అనుబంధం మెరుగవుతుంది.
ఇద్దరు కలిసి పని చేయడం
ఇంట్లో పని భార్యనే చేయాలన్న ఆలోచనను పక్కన పెట్టండి. వారంలో కనీసం ఒకటి రెండు రోజులైనా భాగస్వామితో కలిసి ఇంట్లో పనిచేయండి. భార్యకు వంటలో సాయం చేయండి లేదా ఇంటి పనిలో సహాయం చేయండి. ఇలాంటివి వారిలో మీపై మంచి దృక్పథం పెరిగేలా చేస్తుంది.
క్షమించండి
ఏదైనా తప్పు జరిగే క్షమించడం, మర్చిపోవడం అనే విధానాన్ని పాటించాలి. గతంలో జరిగిన విషయాలను ప్రస్తావనకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పాటిస్తే దాంపత్య జీవితం సరదాగా సాగిపోతుంది.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి
(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)