మీరు ప్రేమలో ఉన్నారా..? అయితే మీ బాయ్ ఫ్రెండ్ ని ఈ ప్రశ్నలు అడగకండి..!
మీరు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా ప్రశ్న వేసినప్పటికీ, అతను మిమ్మల్ని డబ్బు వెంబడి పరుగెత్తే వ్యక్తిగా భావించవచ్చు. కాబట్టి, ప్రేమలో పడిన కొత్తలో ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు.
ప్రేమలో ఉన్నవారికి ప్రంపచం తెలీదు. ముఖ్యంగా ప్రేమలో పడిన కొత్తలో తాము ప్రేమించిన వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అమ్మాయిలు ఎక్కువగా ఆశపడతారు. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అంటూ.. అంచనాలు వేసుకుంటూ ఉంటారు. అయితే.. మీ ప్రేమ జీవితం సజావుగా సాగాలంటే.. అమ్మాయిలు.. తమ బాయ్ ఫ్రెండ్ ని కొన్ని ప్రశ్నలు అస్సలు అడగకూడదట. మరి ఆ ప్రశ్నలేంటో ఓసారి చూద్దాం..
జీతం: ప్రేమిస్తున్నాం కదా.. మాకు అన్ని తెలియాలి అని అనుకోకూడదు. ప్రేమలో పడిన వెంటనే.. జీతం గురించి అడగకూడదు. అతని పే స్కేల్ గురించి అడగడం వల్ల మీ వారి అభిప్రాయం వేరేలా ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా ప్రశ్న వేసినప్పటికీ, అతను మిమ్మల్ని డబ్బు వెంబడి పరుగెత్తే వ్యక్తిగా భావించవచ్చు. కాబట్టి, ప్రేమలో పడిన కొత్తలో ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు.
బహుమతులు, డేట్స్: బహుమతులు లేదా డేట్స్ కి వెళదామని ఎప్పుడూ అడగవద్దు, ఇది మీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌పై మీపై చెడు ఇమేజ్‌ని కలిగిస్తుంది. మీరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే.. ఇలాంటివి అడగాలి.
మీలానే ఉండండి: ఎప్పుడైనా మీరు మీలానే ఉండాలి.నటించకండి. ఎందుకంటే.. ఎక్కువ కాలం నటించలేం. ఎప్పుడో ఒకప్పుడు.. మీ రియాల్టీ బయటపడుతుంది.
మాజీ బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోండి : మీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో పాత బాయ్ ఫ్రెండ్ గురించి అస్సలు మాట్లాడకూడదు.; అది అతనికి అసౌకర్యంగా ఉండవచ్చు. మీరు వారితో నిజంగా ప్రేమలో లేరేమో అని వారు అనుకోవచ్చు.
ఇతరుల సమయాన్ని షరతులను గౌరవించడం ముఖ్యం. ఎవరైనా మన కోసం మారడం అంత సులువేమీ కాదు. కాబట్టి.. బలవంతంగా వారిని మారమని అడగొద్దు. సమయం వస్తే.. నిజంగా వారు మీకు నచ్చినట్లు మారే అవకాశం ఉంది. అప్పటి వరకు వేచి ఉండండి.
మిమ్మల్ని అతని స్నేహితులకు పరిచయం చేయమని అడగగడం: మీ బాయ్ ఫ్రెండ్.. మిమ్మల్ని వారి స్నేహితులకు పరిచయం చేయడం లేదు అంటే.. అతను మీతో టైమ్ పాస్ చేయడం వల్లనో లేదా మీ పట్ల సీరియస్‌గా లేనందువల్లనో కాదు. ఇది ఇతర కారణాలు కావచ్చు. కాబట్టి వేచి ఉండండి. వారి స్నేహితులకు పరిచయం చేయమని తొందరపెట్టొద్దు.