Relationship: భర్తలు పరాయి స్త్రీ వైపు చూడకూడదంటే.. భార్యలు ఇలా ప్రవర్తించండి?
Relationship: భార్యలు తమ భర్తలు వేరే స్త్రీల వైపు మొగ్గు చూపిస్తున్నారని బాధపడతారు. అయితే భర్తల ప్రవర్తన వెనక తమ ప్రభావం ఎంతవరకు ఉంది అనేది గమనించరు. భార్యలు కనక ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే భర్తలు పరాయి ఆడదాని మొహం కూడా చూడరు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒక భర్త తన భార్యని కాకుండా మరొక స్త్రీ వైపు చూస్తున్నాడు అంటే పూర్తిగా కాకపోయినా భార్య ప్రవర్తన కూడా కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి భర్త అనురాగాన్ని కోరుకునే స్త్రీలు ముందుగా భర్త ఎదురుగుండా సంతోషంగా తిరుగుతూ వాళ్ళ భర్తలని కూడా సంతోషంగా ఉండేలాగా చూసుకోండి.
తన కళ్ళ ముందు భార్య సంతోషంగా తిరిగితే ఆ భర్తకి అంతకంటే ఆనందం ఉండదు. భర్తకి కష్టం వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పడం ఒక ఉత్తమ ఇల్లాలి బాధ్యత. భర్త వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు భర్తని నిందించకుండా ముందు అతనికి ధైర్యం చెప్పండి వీలైతే ఆ సమస్యని పరిష్కరించండి.
అలాంటి బాధ్యతగల భార్యని ఏ భర్త అంత త్వరగా వదులుకోడు. అలాగే నిజాయితీ కలిగిన, సమయస్ఫూర్తి కలిగిన భార్యని పక్కన పెట్టుకొని ఏ భర్త పరాయి ఆడదాని ముఖం చూడడు. అలాగే భర్తని పదిమందిలో గౌరవించే ఆడదాన్ని కూడా భర్త నెత్తి మీద పెట్టి చూసుకుంటాడు. లేనిపోని బాధ్యతలు భర్త నెత్తి మీద రుద్దకండి. మీరు చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే మీరు చక్కబెట్టుకోండి.
బాధ్యతలలో వీలైనంత మటుకు భార్యలు కూడా పంచుకోవడం వలన ఆ భర్త సంతోషిస్తాడు. చెప్పిన పని చేయలేదని, అడిగిన వస్తువు తేలేదని భర్త మీద కేకలు వేయటం కాకుండా.. అతను ఎలాంటి పరిస్థితులలో తేలేకపోయాడో..
అనే విషయాన్ని అర్థం చేసుకుంటే ఆ భర్త కన్నా అదృష్టవంతుడు మరొకడు ఉండడు. అలాగే భర్త ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టడం. భర్త కష్టాన్ని పిల్లలకి తెలిసేలాగా చేయడం ఒక ఉత్తమ ఇల్లాలి బాధ్యత.
అలాంటి బాధ్యత కలిగిన భార్యని వదిలేసి ఏ భర్త పరాయి ఆడదాని ముఖం చూడడు. కాబట్టి ముందు భర్తల మీద అరిచి కేకలు వేయడం కాకుండా భార్యల ప్రవర్తనలో తెచ్చుకుంటే మీ సంసారంలో వచ్చే మార్పులని మీరే గమనించగలరు.