MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • పెళ్లి విషయంలో అయోమయంగా ఉన్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..

పెళ్లి విషయంలో అయోమయంగా ఉన్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే..

వివాహమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. అందుకే ఈ విషయంలో  నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు జీవితంలో ఎంతో బాధపడాల్సి వస్తుంది. అందుకే పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీరు పెళ్లి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 12 2024, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
marriage

marriage

పెళ్లితో రెండు జీవితాలు ముడిపడతాయి. మునపటి లైఫ్ కు, వైవాహిక జీవితానికి ఎంతో తేడా ఉంటుందన్న ముచ్చటను తెలుసుకుంటారు. ఏదేమైనా ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకతప్పదు. అలా అని ఎవరినో ఒకరిని చేసుకోవడంలో అర్థం లేదు. పెద్దల కోసమో.. ఒత్తిడి వల్లే మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మీ ఆలోచనలను నిర్మొహమాటంగా మీరు మీ భాగస్వామికి చెప్పుకునేలా మీ వైవాహిక బంధం ఉండాలి. అలాగే మీ లోపాలను, బలాలను మీ భాగస్వామికి చూపించే విధంగా ఉండాలి. అలాగే మీ భాగస్వామి మీ మంచి, చెడు రెండు లక్షణాలను స్వీకరించేలా ఉండాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి మీ జీవితంలోకి వస్తే మీ మ్యారేజ్ లైఫ్ అందంగా ముందుకు సాగుతుంది. 
 

35

అయితే చాలా మందికి పెళ్లిపై ఒక క్లారిటీ ఉండదు. అంటే ఫ్యామిలీ వల్ల, ఒత్తిడి వల్లే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంటారు. కానీ దీనివల్ల మీ వైవాహిక జీవితం సాఫీగా సాగదు. అసలు మీరు పెళ్లి చేసుకోవడానికి మానసికంగా సిద్దంగా ఉన్నారా? లేదా? అనే విషయంలో క్లారిటీగా ఉండాలి. క్లారిటీ లేకుండా పెళ్లికి తొందర పడితే తర్వాత మీ బంధంలో గొడవలు, కొట్లాటలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడకండి. మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి. అసలు క్లారిటీ లేకుండా పెళ్లి ఎందుకు చేసుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం..
 

45
marriage

marriage


మీరు పెళ్లిని ఎందుకు చేసుకోవాలనుకుంటారంటే? 

ఒంటరిగా ఉన్నానని మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్దపడొచ్చు. పెళ్లి చేసుకుంటే ఈ లోన్లీనెస్ తొలగిపోతుందని మీరు అనుకుంటారు. కానీ సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే మీరు ఒంటిరిగా ఫీలయ్యే అవకాశం ఉంది. 
మీరు మీ వ్యక్తిగత సమస్యలను వదిలించుకోవాలనుకుంటున్నారు.
మీ ప్రస్తుత పరిస్థితి నుంచి పారిపోవాలనుకుంటున్నారు.
మీరు మీ తల్లిదండ్రులను, బంధువులను సంతోషపెట్టాలనుకుంటున్నారు.
సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.
నేటి ట్రెండ్ కు అనుగుణంగా సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయించడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.
 

55
marriage

marriage

పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటారంటే? 

వివాహం వంటి జీవితకాల నిబద్ధతకు మీరు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నారు.
మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాల ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు.
మీ జీవిత ప్రయాణాన్ని మీ భాగస్వామితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
మీ జీవిత లక్ష్యాలు, మీ ఇష్టాలు, ఆసక్తులు జీవితంపై మీ వ్యక్తిగత అభిప్రాయాలకు పూర్తిగా భిన్నమైన వ్యక్తితో మీ గదిని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆఫీస్ రొమాన్స్... ఇదే ఇప్పుడు ట్రెండ్..!
Recommended image2
Relationship Tips: గృహశాంతి కోసం అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిందేంటో తెలుసా? ఈ సూత్రాలే మీ ఇంటికి శ్రీరామరక్ష
Recommended image3
Shrekking Dating: అందం కంటే అదే ముఖ్యం.. డేటింగ్‌లో Gen Z యువ‌త కొత్త ట్రెండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved