30 ఏండ్లు దాటినంక పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
కొంతమంది 20 ఏండ్లు దాటినంక పెళ్లి చేసుకుంటే మరికొంత మంది మాత్రం 30 దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వీరి మధ్య చాలా చాలా వ్యాత్యాసం ఉంటుంది. మీరు 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
పెళ్లికి సరైన వయసు ఏది అనేదానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. కొంతమంది 20 నుంచి 25 ఏళ్ల లోపున్న పిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ నేటితరం యువత ముఖ్యంగా పై చదువులు చదివిన వారు మాత్రం 30 దాటిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగం చేయాలి. మంచి పొజీషన్ లో స్థిరపడిన తర్వాతే పెళ్లిళ్లను చేసుకుంటున్నారు. ఫలితంగా 30 ఏండ్లు ఈజీగా దాటుతున్నాయి.
20 ఏండ్లకే పెళ్లి చేసుకునేవారికి, 30 ఏళ్లకు పెళ్లి చేసుకునేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాల వయస్సు అనేది ఒక వ్యక్తి కౌమారదశ ముగిసి, అతను పరిపక్వత చెంది జీవితంలో తదుపరి దశకు వెళ్లే వయస్సు. ముఖ్యంగా 30 ఏండ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటే కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే?
అవసరాలపై స్పష్టత ఉంటుంది
సాధారణంగా 30 ఏండ్లు పైబడిన వారికి తమకు ఏం కావాలో స్పష్టమైన అవగాహణ ఉంటుంది. 30 ఏండ్ల వయసు వరకు ఎంతో మంది స్నేహితులను కలుసుకుంటారు. వాళ్లను చూసి పరిస్థితులను వీళ్లు బాగం అర్థం చేసుకుని ఉంటారు. ఇది వారి జీవిత భాగస్వామిని సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
సంకల్ప శక్తి
30 ఏండ్లు దాటిన వారికి జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా జీవించడానికి చాలా సంకల్ప శక్తి ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత తమ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటిని ఎదుర్కొని ముందుకు సాగుతారు. కానీ భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటారు. కానీ ఈ మనస్తత్వం 20 ఏండ్ల కుర్రాళ్లకు ఉండదు.
పిల్లలను కనడంలో ఇబ్బంది
సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా పిల్లల్ని కనడంలో ఇబ్బందులు వస్తాయి. అయితే 30 ఏండ్లు పైబడిన వ్యక్తుల్లో జీవ గడియారంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే దృఢ సంకల్పం ఉంటే ఈ సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే 30 ఏండ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నిజానికి గర్భం దాల్చడం చాలా కష్టం. మీరు గర్భవతి అయితే నార్మల్ డెలివరీకి చాలా తక్కువ అవకాశం ఉంది.
marriage
పని, కుటుంబం
సాధారణంగా 20 ఏండ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న వ్యక్తులు తమ పని, ఇంటిని చూసుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. కానీ 30 ఏండ్ల వారికి అలా కాదు. వారి మనస్సు చాలా స్పష్టంగా ఉంటుంది. వీరికి తమ భవిష్యత్తు ప్రణాళిక, ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. దీంతో వీరు వారి వృత్తి, కుటుంబాన్ని మెరుగ్గా నిర్వహిస్తారు.
MARRIAGE
ప్రేమను అర్థం చేసుకుంటారు
20 ఏండ్ల వయసులో పెళ్లి చేసుకున్న వారి జీవితం మొదట్లో ఎంతో ఆనందంగా, సౌకర్యవంతంగా సాగుతుంది. కానీ కాలక్రమేణా వీళ్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా లైఫ్ ను లీడ్ చేయడం కష్టంగా మారుతుంది. కానీ పెళ్లయి 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రేమలో మాధుర్యం ఉండదని తెలుసుకుంటారు.
మనోధైర్యం
30 ఏండ్లు దాటిని వారిలో మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీళ్లు కుటుంబంలో, సమాజంలో ఎదుర్కొనే సమస్యలను చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు.