కలియుగ ద్రౌపది.... అన్నదమ్ములందరికీ ఒకే భార్య
మంద ఎక్కువైతే మజ్జిగ పలచనౌతుందనే సామేత వినే ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే మందను తగ్గించాలని అనుకున్నారు. అందులో భాగంగానే... ఇలా ఇంట్లో కొడుకులందరికీ ఒకే అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఎప్పుడో తాతల కాలంలో ఈ ఆచారం మొదలుపెట్టగా... ఇప్పటికీ అక్కడి ప్రాంతవాసులు దీనినే ఫాలో అవుతూ వస్తుండటం విశేషం.
మహాభారతం గురించి కాస్తో కూస్తో ఐడియా ఉన్నవారందరికీ ద్రౌపది గురించి తెలిసే ఉంటుంది. అసలు ముందు ద్రౌపది అనే పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమెకు ఐదుగురు భార్యలు అన్న విషయం. అయితే ఇప్పటికే అలాంటి కలియుగ ద్రౌపదులు ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా..? అది కూడా మనదేశంలోనే. మీరు చదివింది నిజమే... మన దేశంలో కలియుగ ద్రౌపదులు ఉన్నారు. ఒక ఇంట్లో అన్నదమ్ములందరినీ ఒకే ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది.
ఈ కాలంలో ఇలాంటివి వినడానికి కాస్త ఇబ్బందిగా, నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజంగా నిజం. ఈ సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ లోని శివారు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడి వారి నిబంధనట అది.
ఆ నిబంధన ప్రకారం కుటుంబంలోని అన్నదమ్ములంతా ఒకే యువతిని పెళ్లి చేసుకుంటారట. ఇలా పెళ్లి చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఉండటం గమనార్హం. ఆ ప్రాంతాల్లో ప్రజలంతా వ్యవసాయ భూమిపైనే ఆధారపడి జీవిస్తుంటారు.
ఎంత లేదనుకున్నా ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు మగపిల్లలు ఉంటారు. వారంతా ఒక్కొక్కరు ఒక్కో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుటుంబ పోషణ భారంగా మారుతుందని వారి భావనట.
మంద ఎక్కువైతే మజ్జిగ పలచనౌతుందనే సామేత వినే ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే మందను తగ్గించాలని అనుకున్నారు. అందులో భాగంగానే... ఇలా ఇంట్లో కొడుకులందరికీ ఒకే అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఎప్పుడో తాతల కాలంలో ఈ ఆచారం మొదలుపెట్టగా... ఇప్పటికీ అక్కడి ప్రాంతవాసులు దీనినే ఫాలో అవుతూ వస్తుండటం విశేషం.
ఆ ఇంట్లో ఎంత మంది అన్నదమ్ములంటే అంతమందికి ఆమె ఒక్కతే భార్యగా కొనసాగుతుంది. దాని వల్ల ఇప్పటివరకు తమకు ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని వారు చెబుతుండటం గమనార్హం.
దాదాపు మనదేశంలో పెళ్లికి, వివాహ బంధానికి చాలా గౌరవం ఇస్తాం. ఒక పెళ్లి చేసుకొని... వారికి విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం కూడా నేరంగా భావిస్తూ ఉంటాం. అలాంటి దేశంలో ఇప్పటికీ ఇలాంటి ఆచారాలు ఉన్నాయంటే విడ్డూరంగా అనిపిస్తూనే ఉంటుంది.