భార్య మనసు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా?
మహిళల మనసు అర్థం చేసుకోవడానికి మరో మహిళ అవ్వాల్సిన అవసరం లేదు. వారు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే చాలాట.

భార్యాభర్తల మధ్య గొడవలు తరచుగా వస్తూనే ఉంటాయి. అయితే… ఈ గొడవ కావడానికి తమ భార్యే కారణం అని ఎక్కువ మంది భర్తలు చెబుతూ ఉంటారు. ఆమె మనసులో ఏం ఉందో కూడా తమకు అర్థం కాదని, అందుకే ఈ గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు. కానీ, స్త్రీలను అర్థం చేసుకోవడం చాలా సులువు. మరి.. భార్యను ఒక భర్త ఎలా అర్థం చేసుకోవాలో, అసలు ఒక అమ్మాయిని పురుషులు ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం….
సాధారణంగా పురుషులు ఒకటి అనుకుంటే.. స్త్రీలు మరోటి ఆలోచిస్తారట. దాని వల్ల వారి మధ్య తేడాలు వస్తూ ఉంటాయి. మహిళల మనసు అర్థం చేసుకోవడానికి మరో మహిళ అవ్వాల్సిన అవసరం లేదు. వారు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే చాలాట.
భార్యను అర్థం చేసుకోవడానికి భర్త చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? మీ భార్యను మీ తల్లితో పోల్చడం. మా అమ్మ ఇంట్లో అన్ని పనులు చేస్తుంది.. నువ్వు చేసుకోలేవా అని అనడం మానేయాలి. కాబట్టి ఇంటి విషయాలకు బాధ్యత వహించండి. ఇంటి పనుల భారం మొత్తం మహిళలపై వేయకండి. మీ ప్రేమను ఎప్పటికప్పుడు వారికి తెలియజేయండి.
భార్య పీరియడ్స్ లో ఉన్న సమయంలో వారి మానసిక స్థితి సరిగా ఉండదు. ఆ సమయంలో మీరు గొడవలు పడటం, వాదనలకు దిగడం మంచిది కాదు. వీలైనంత వరకు ఆ సమయంలో వారిని ప్రశాంతంగా ఉంచాలి. వారికి ఉన్న మూడ్ స్వింగ్స్ కి ఎలా ప్రవర్తించినా మీరు ప్రశాంతంగా ఉంటే గొడవలు జరగవు.
మగవాళ్లకు మాత్రమే అందంగా కనిపించాలని మహిళలు భావించరు. ఆడవాళ్ల కళ్లు ఎక్కడికి వెళ్లినా అందరినీ ఆకర్షించేలా ఉంటాయి. కాబట్టి స్త్రీలు ధరించే దుస్తులను విమర్శించకండి. స్త్రీలకు డ్రెస్సింగ్‌లో వ్యక్తిగత ఆనందం ఉంటుంది.
ఇంట్లో దుస్తులు విచ్చలవిడిగా ఉంటే వాటిని ఎలా మడతపెట్టాలో తెలియదని మహిళలను విమర్శించకండి
స్త్రీలు తమ కోసం సమయాన్ని వెచ్చించాలనే కోరిక కలిగి ఉంటారు. మగవారిలాగే స్త్రీలు కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఈ విషయాన్ని కూడా భర్త అర్థం చేసుకోవాలి. ఇంట్లోనే ఉండాలి, ఉంచాలి అని ఆలోచించకూడదు.
అంతేకాకుండా, మహిళలకు తమ ఆహారపు అలవాట్లు, బరువుపై ఎవరైనా విమర్శలు చేస్తే వారికి నచ్చదు. కాబట్టి.. వాటి మీద కామెంట్స్ చేయకపోవడమే మంచిది.