Relations: భార్యభర్తల మధ్య వీటికి చోటు ఇవ్వద్దు..!
ఒక బంధం సవ్యంగా , ఆనందంగా సాగాలంటే.. వారి మధ్య నమ్మకం అనేది చాలా అవసరం. ఒకరిపై ఒకరు నమ్మకం లేకుండా.. ఎక్కువ దూరం ప్రయాణించలేరు. నమ్మకం లేని బంధంలో భద్రత ఉండదు. అలాంటి బంధం ఎక్కువ కాలం నిలవదు.
భార్యభర్తల మధ్య బంధం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారి బంధంలో ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండాలని.. సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. అది అందరికీ సాధ్యం కాదు. ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించినా.. ఏవోక గొడవలు వస్తూనే ఉంటాయి. కొన్ని రకాల లక్షణాలు, ప్రవర్తనల కారణంగా.. ఈ వివాదాలు వచ్చే అవకాశం, బంధానికి బీటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
ఒక బంధం సవ్యంగా , ఆనందంగా సాగాలంటే.. వారి మధ్య నమ్మకం అనేది చాలా అవసరం. ఒకరిపై ఒకరు నమ్మకం లేకుండా.. ఎక్కువ దూరం ప్రయాణించలేరు. నమ్మకం లేని బంధంలో భద్రత ఉండదు. అలాంటి బంధం ఎక్కువ కాలం నిలవదు.
కొందరు.. తమ బంధంలో ఒకరిపట్ల మరొకరు గౌరవంగా ఉండాలి. కానీ.. కొందరు తమ పార్ట్ నర్స్ ని ఘోరంగా కించ పరుస్తూ ఉంటారు. అందరి ముందు కూడా.. బూతులు తిట్టడం, దుర్భాషలాడటం లాంటివి చేస్తూ ఉంటారు. శారీరకంగా హింసించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి బంధం ఎక్కువ కాలం నిలవదు. ఎవరూ అలాంటి బంధం కావాలని కూడా అనుకోరు.
పూర్వకాలం నుంచి చాలా మంది ఇళ్లల్లో భర్తల మాటలు మాత్రమే భార్యలు వింటారు. భర్తలు ఎం చెబితే అాది మాత్రమే వినాలి. అది చూసి వారి పిల్లలు కూడా అలానే తయారౌతారు. అయితే.. ఈ విషయంలో కొంత మార్పు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ దానినే ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు.
అయితే.. అన్ని విషయాల్లో కాకపోయినా.. మంచి చెప్పినప్పుడు భార్య చెప్పిన విషయాన్ని భర్త వినడం ఉత్తమం. అలా వినడం వల్ల.. వారికి కూడా మీరు గౌరవం ఇచ్చిన వారు అవుతారు. దీంతో.. మీ బంధం ఆనందంగా సాగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక.. అబద్దాలు చెప్పే అలవాటు చాలా మందికి ఉంటుంది. అవసరానికి ఓ అబద్దం చెప్పడం చాలా సహజం. అయితే.. కొందరు అదే పనిగా పెట్టుకొని.. మాట్లాడితే అబద్ధాలు చెబుతూ ఉంటారు. నిజాలు దాచిపెడుతూ ఉంటారు. అబద్ధాలతో బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటూ ఉంటారు. దాని వల్ల.. వారి బంధం సరిగా ఉండదు. అబద్ధపు పునాదులపై కాపురం నిలపడదు.
సంబంధం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండాలి . ప్రేమ-స్నేహంలో మనసు వికసించాలి. వారి కోసం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతిదీ చేయడం మీ ఆందోళనను తగ్గిస్తుంది. అలా చేయడం వల్ల.. మీరు ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.