78 యేళ్ల వరుడు, 17 యేళ్ల వధువు.. పెళ్లైన 22 రోజులకే...

First Published 6, Nov 2020, 4:25 PM

ఇండోనేషియా రాజధాని జకార్తాలో 78యేళ్ల వృద్దుడు, 17 యేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఫోటోలు హల్ చల్ చేశాయి.

ఇండోనేషియా రాజధాని జకార్తాలో 78యేళ్ల వృద్దుడు, 17 యేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఫోటోలు హల్ చల్ చేశాయి. ఎందుకంటే 78 ఏళ్ల వృద్ధుడు వయసులో తనకంటే 61 ఏళ్లు చిన్నదైన యువతిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించాడు. దీనికి ఆ యువతి, ఆమె కుటుంబం మనస్ఫూర్తిగా అంగీకరించడం కొసమెరుపు.

జనాలు ఈ పెళ్లి షాక్‌ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే ఈ వృద్ధ,యవ్వన జంట ఇప్పుడు మరో బాంబ్‌ పేల్చింది. పెళ్లై పట్టుమని నెల రోజులు కూడా కాకముందే విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు ఈ దంపతులు

గత నెలలో అబా సర్నా (78), నోని నవిత (17) అనే యువతిని ఎంతో వైభవంగా బంధుమిత్రులందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లై కనీసం నెల రోజులు కూడా కాలేదు. సరిగ్గా చెప్పాలంటే వివాహం అయిన 22 రోజులకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఇదంతా కలలా తోస్తుంది. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. విడాకులు తీసుకోబోతున్నారని తెలిసి షాక్‌ అయ్యాం’ అన్నారు. అంతేకాక ‘అబా సర్నాతో మాకు ఎలాంటి సమస్య లేదు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ వివాహం నచ్చలేదు. అ‍క్కడి నుంచే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చు’ అన్నారు.

కానీ అబా సర్నా కుటుంబ సభ్యులు మాత్ర నోని పెళ్లికి ముందే గర్భవతి అని.. ఆ విషయం దాచి పెట్టి వివాహం చేశారని అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అయితే నోని కుటుంబ సభ్యులు ఈ ఆరోపణల్ని ఖండించారు.

వివాహ సమయంలో అబా సర్నా, నోనికి మోటార్‌ సైకిల్‌తోపాటు 50 వేల రూపాయల నగదుతో పాటు ఆమెకు అవసరమైన వాటిని కట్నంగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

ఇక్కడ వరుడు, వధువుకు కట్నం ఇవ్వడం సాధారణం. ఇలాంటి సంఘటనే ఒకటి ఇండోనేషియాలో గత ఏడాది చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు గర్ల్‌ ఫ్రెండ్స్‌ని బాధపెట్టడం ఇష్టం లేక ఇద్దరిని వివాహం చేసుకున్నాడు.