- Home
- Life
- Relationship
- Relationship Tips: విక్కీ-కత్రినా నుంచి ఈ రిలేషన్ షిప్ టిప్స్ నేర్చుకోవాల్సిందే..!
Relationship Tips: విక్కీ-కత్రినా నుంచి ఈ రిలేషన్ షిప్ టిప్స్ నేర్చుకోవాల్సిందే..!
Relationship Tips: బాలీవుడ్ లవ్లీ కపుల్ విక్కీ, కత్రినా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ జంటలా అన్యోన్యంగా ఉండాలి అంటే.. వారి సీక్రెట్స్ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వాల్సిందే.

Vicky- Katrina
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోగా.... త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఫోటోతో ప్రకటించారు. మరి.. ఈ జంట నుంచి.. ప్రతి భార్యభర్తలు కచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా....
1.ప్రేమను రహస్యంగా ఉంచడం...
ఒకరితో రిలేషన్ మొదలుపెట్టినప్పుడు.. చాలా ఒత్తిడులు ఏర్పడతాయి. అయితే.. మీ బంధం బలపడే వరకు.. దానిని సీక్రెట్ గా ఉంచడం మంచిది. విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ లు అదే చేశారు. తాము జీవితాంతం కలిసి ఉంటాం.. పెళ్లి చేసుకుంటాం అనే నిర్ణయం తీసుకునే వరకు వీరు.. తమ రిలేషన్ ని ఎక్కడా బయట పెట్టలేదు. సీక్రెట్ గానే ఉంటారు. ఈ సమయం.. వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా బాగా సహాయపడింది.
2. గోప్యత , శాంతి
ప్రతి దానిని పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జంట తమ డేటింగ్, వెడ్డింగ్, గర్భం అన్నీ చివరి నిమిషం వరకు ప్రైవేట్‌గా ఉంచారు. అనవసర జడ్జ్‌మెంట్ నుంచి దూరంగా ఉండటానికి ఇది ఒక మంచి పాఠం.
3. ఒకరికి మరొకరు సపోర్ట్ ఇవ్వడం...
విక్కీకి కత్రినా క్రమశిక్షణ, వర్క్ ఎథిక్ స్ఫూర్తి ఇస్తే, కత్రినాకు విక్కీ తన కుటుంబంపై చూపే ప్రేమ, గౌరవం ఎంతో ఇష్టం. రిలేషన్‌లో ఒకరికి ఒకరు మద్దతు, ప్రోత్సాహం ఇవ్వడం బంధాన్ని మరింత బలపరుస్తుంది.
4. కుటుంబ బంధాలను ఆలింగనం చేసుకోండి
హ్యాపీ రిలేషన్ అనేది కేవలం ఇద్దరి మధ్య ఉండదు, వారి కుటుంబాలతోనూ ముడిపడి ఉంటుంది. కత్రినా–విక్కీలు ఇద్దరూ ఒకరి కుటుంబాన్ని మరొకరు గౌరవంగా స్వీకరించారు. ఇది రిలేషన్‌షిప్‌లో హార్మనీకి దారితీసింది.
5. తేడాలు దూరం చేయవు, సమతుల్యం తీసుకొస్తాయి
విక్కీ విధి, అదృష్టాన్ని నమ్ముతాడు. కత్రినా కృషి, లక్ష్యసాధనను నమ్ముతుంది. ఇద్దరూ వేరువేరు తత్వాలు కలిగినప్పటికీ, ఒకరినొకరు ప్రేమగా మార్చుకున్నారు. ఇది నిజమైన ప్రేమకి చాలా అవసరం.
రిలేషన్‌షిప్ బలపడాలంటే ఒకేలా ఉండటం అవసరం లేదు. గోప్యత, పరస్పర గౌరవం, కుటుంబాల మధ్య వెచ్చదనం, ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. ఇవే హ్యాపీ కపుల్ సీక్రెట్స్. ఇవి అందరూ ఫాలో అయితే.. కచ్చితంగా బంధం బలంగా ఉంటుంది.