- Home
- Life
- Relationship
- Relationship: ప్రతి పేరెంట్స్..పెళ్లి కావాల్సిన కొడుక్కి కచ్చితంగా చెప్పాల్సినవి ఇవే..!
Relationship: ప్రతి పేరెంట్స్..పెళ్లి కావాల్సిన కొడుక్కి కచ్చితంగా చెప్పాల్సినవి ఇవే..!
పెళ్లికి ముందే అమ్మాయిలను మానసికంగా ఎలా సిద్ధం చేస్తారో..కొడుకులను కూడా అంతే సిద్ధం చేయాలి. మంచి భర్తగా, అల్లుడిగా, భాధ్యతాయుతమైన కొడుకుగా, అల్లుడిగా ఎలా మారాలో కచ్చితంగా నేర్పించాలి.

relationship
పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కాదు, రెండు కుటుంబాల కలయిక. పెళ్లి తర్వాత ఇంటికి వచ్చిన అమ్మాయి అత్తగారింట్లో సర్దుకుపోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ బంధం సరిగ్గా సాగాలంటే ఇరు వైపులా సర్దుబాటు అవసరం. దానికి కాస్త సమయం పడుతుంది.దాదాపు పెళ్లి తర్వాత అత్తమామలతో ఎలా ఉండాలి? ఆ ఇంట్లో ఎలా నడుచుకోవాలి అని ప్రతి అమ్మాయికీ వాళ్ల పేరెంట్స్ కొన్ని పాఠాలు నేర్పిస్తారు. అయితే... ఎలా అయితే బాధ్యతగా ఈ విషయాలను ఆడ పిల్లల తల్లిదండ్రులు నేర్పిస్తున్నారో... అబ్బాయి పేరెంట్స్ కూడా తమ కొడుక్కి పెళ్లికి ముందే కొన్ని విషయాలు చెప్పాలి... మరి కొన్ని నేర్పించాలి కూడా. పెళ్లికి ముందే అబ్బాయిలకు పేరెంట్స్ ఎలాంటి విషయాలు కచ్చితంగా నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం...
పెళ్లికి ముందే అమ్మాయిలను మానసికంగా ఎలా సిద్ధం చేస్తారో..కొడుకులను కూడా అంతే సిద్ధం చేయాలి. మంచి భర్తగా, అల్లుడిగా, భాధ్యతాయుతమైన కొడుకుగా, అల్లుడిగా ఎలా మారాలో కచ్చితంగా నేర్పించాలి. అప్పుడే ఆ రెండు కుటుంబాలు ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగుతాయి.
భార్యకు సమానమైన హోదా...
పెళ్లి తర్వాత భర్త బాగోగులు, బాధ్యత అంతా ఆడపిల్ల ఎలా చూసుకుంటుందో.. భార్య బాధ్యత బాగోగులు కూడా భర్త అలానే తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మీ కొడుక్కి కచ్చితంగా నేర్పించాలి. మీరు ఇంట్లో తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆమె పాల్గొనేలా చేయాలని నేర్పించాలి. ఇంటికి వచ్చిన ఆడపిల్లల భావాలను, అభిప్రాయాలను కచ్చితంగా గౌరవించాలి. కోడలు అతిథి కాదు.. ఇంట్లో శాశ్వత భాగం అనే విషయం మీరు అర్థం చేసుకోవడంతో పాటు.. మీ కుమారుడికి కూడా అర్థమయ్యేలా చెప్పాలి.
తల్లీ, భార్యకు మధ్య ఇరుక్కోవడం....
వివాహం తర్వాత, తల్లీ, భార్య మధ్య చిక్కుకొని చాలా మంది అబ్బాయిలు ఇబ్బందిపడుతూ ఉంటారు. దానికోసం అబ్బాయి తల్లిగా మీరే ఎక్కువ బాధ్యత వహించాలి. కొడలికి ఇంట్లో ఏ సమస్యలు లేకుండా మీరు చూసుకోవాలి. అప్పుడు మీ అబ్బాయి కూడా ప్రశాంతంగా ఉంటాడు. తల్లికీ, భార్యకు తేడాలు వచ్చినా అబ్బాయిలు కూడా ఒకరిని సమర్థించడం, మరొకరికి దూరం చేయడం కాకుండా.. తేడాలను తగ్గించడానికి ప్రయత్నించాలి.
ఇంటి పనుల్లో సహాయం చేయడం...
ఇంటి పనులు కేవలం స్త్రీలు మాత్రమే చేసే పనులు కాదని.. మీ కుమారుడికి చిన్నతనం నుంచే నేర్పించాలి. ఇంటి పనులు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవాలని చెప్పాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఇంటి పనులు చేయడానికి మగ పిల్లలు సిగ్గుపడకూడదని మీకు కచ్చితంగా మీ అబ్బాయికి నేర్పించాలి.
కోడలి కుటుంబ బాధ్యత కూడా...
పెళ్లి తర్వాత.. కోడలిని మీ కుటుంబంలో ఒకరిగా చూసుకోవడమే కాదు, ఆమె తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకోవాలని, ఆమె తల్లిదండ్రులను కూడా కచ్చితంగా గౌరవించాలి అని మీ కొడుక్కి మీరు నేర్పించాలి.
వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం....
భార్యభర్తల మధ్య విషయాలు చాలా వ్యక్తిగతమైనవి. చిన్న చిన్న విషయాలు ఇతరులకు పంచుకోవడం, ముఖ్యంగా తల్లిదండ్రులతో పంచుకోవడం కూడా అపార్థాలకు దారితీస్తుంది. కాబట్టి..వారిద్దరి మధ్య పర్సనల్ విషయాలను ఎవరితోనూ చెప్పొద్దని మీ కుమారుడికి మీరు ముందే చెప్పాలి.
పొగడ్తలు ఇవ్వడం..
ప్రతి స్త్రీ తన భాగస్వామి నుండి ప్రశంసలు వినడానికి ఇష్టపడుతుంది. అందుకే మీరు మీ కొడుకుకు ధన్యవాదాలు చెప్పడం, ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత తెలియజేయడం లేదా ఎవరైనా మీకు సహాయం చేస్తే వారికి మంచిగా చెప్పడం నేర్పించాలి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మీరు చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించాలి.