చిన్న పిల్లలకు ఆవు పాలు ఎందుకు తాగించకూడదు?
గేదె పాల కంటే ఆవు పాలే ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తాయన్న మాటను వినే ఉంటారు. కానీ ఆవు పాలను చిన్న పిల్లలకు తాగించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?
చిన్న పిల్లలకు ఆవు పాలే మంచివని చాలా మంది అనుకుంటుంటారు. అలాగే గేదె పాలకంటే ఆవు పాలనే పిల్లలకు పట్టించమని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. కానీ నవజాత శిశువుకు ఆవు పాలు అంత ప్రయోజనకరంగా ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి నవజాత శిశువులు ఆవు పాలలో ఉన్న ప్రోటీన్, ఖనిజాల మొత్తాన్ని జీర్ణించుకోలేరు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అసలు పిల్లలకు ఆవు పాలు ఎందుకు తాగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అధిక సంక్లిష్ట ప్రోటీన్
ఆవు పాలలో ఎక్కువ మొత్తంలో సంక్లిష్ట ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ పుట్టిన వెంటనే దూడ నిలబడటానికి, నడవడానికి సహాయపడుతుంది. కానీ ఈ సంక్లిష్ట ప్రోటీన్ చిన్న పిల్లల మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. నిజానికి పిల్లల జీర్ణ వ్యవస్థ ఈ ప్రోటీన్ ను సరిగా జీర్ణం చేసుకోలేదు. అందుకే ఈ పాలను తాగితే డయేరియాతో పాటుగా మూత్రపిండాలు దెబ్బతినడంతో వంటి సమస్యలు వస్తాయి. అలాగే పిల్లల మలం లో రక్తం కూడా పడుతుంది.
ఇనుము లోపం
ఆవు పాలలో విటమిన్ సి, ఐరన్ తో పాటుగా ఇతర పోషకాలు ఉండవు. దీనివల్ల శిశువు ఎదుగుదల దెబ్బతింటుంది. పుట్టిన వెంటనే పిల్లలకు ఆవు పాలు తాగించడం వల్ల వారిలో ఇనుము లోపం ఏర్పడుతుంది, ఇది రక్తహీనత సమస్యను తెస్తుంది.
విటమిన్ సి లోపం
ఆవు పాలలో విటమిన్ సి ఉండదు. దీనివల్ల వారి రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది పిల్లలను అనారోగ్యనికి గురికాకుండా రక్షిస్తుంది.
పోషకాహార లోపం
ఆవు పాలలో మీ బిడ్డకు అవసరమైన పోషకాలు అంతగా ఉండవు. ఆవు పాలలో నీళ్లు కలపడం వల్ల బిడ్డకు సరైన మొత్తంలో కొవ్వు కూడా అందదు. దీంతో పిల్లలు హెల్తీగా ఉండరు.
ఊబకాయం
ఆవు పాలను తాగడం వల్ల పిల్లలు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది. నిజానికి ఆవు పాలలో మంచి మొత్తంలో ఫాస్ఫేట్, ప్రోటీన్ ఉంటుంది. దీని వల్ల పిల్లలు బరువు బాగా పెరిగిపోతారు. అలాగే శరీరంపై అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల వారి ఎదుగుదల కూడా ఆగిపోవడం మొదలవుతుంది.
చిట్కా:
తల్లిపాలు రాకపోతే, ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డకు ఫార్ములా పాలను తాగించడం మంచిది. సింపుల్ గా చెప్పాలంటే ఏడాది తర్వాతే పిల్లలకు ఆవు పాలను తాగించాలి.