పిల్లలు మీ మాట వినకపోతే ఈ ట్రిక్ ను ఫాలో అవ్వండి
కొన్ని కొన్ని సార్లు పిల్లలు ఎంత అరిచినా, కొట్టినా మాట అస్సలు వినరు. ఇలాంటి సమయంలో కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే మీ మాట ఖచ్చితంగా వింటారు. అవేంటంటే?
పిల్లలకు రెండు మూడేండ్లు రాగాలనే విపరీతంగా అల్లరి చేస్తుంటారు. ఈ పిల్లల్ని కొంటెపనులు చేయకుండా ఆపడం తల్లిదండ్రుల నుంచి కానేకాదు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఏమన్నాచేసుకుని అని పిల్లల్ని కాసేపు వారి మానన వారిని వదిలేస్తుంటారు. కానీప్రతి సారీ పిల్లలు కొంటె పనులు చేస్తే మాత్రం విపరీతంగా వస్తుంది. వారిని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు బెదిరించడమో, తిట్టడమో, కొట్టడమో చేస్తుంటారు.
పిల్లల్ని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులు ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు పిల్లలు మొండిగా అయ్యి అస్సలు చెప్పిన మాట విననే వినరు. ఇలాంటి సమయంలోనే తలిదండ్రలుకు ఏం చేస్తే ఈ పిల్లలు మాట వింటారని ఆందోళన చెందుతుంటారు. అయితే మీ పిల్లలు మీరు చెప్పిన మాట విననప్పుడు కొన్ని ట్రిక్స్ ను ఫాలో అవ్వండి. దీంతో పిల్లలు మీరేది చెప్తే అది చేస్తారు. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిల్లలు విననప్పుడు మాట్లాడకండి
పిల్లలు మాట వినాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్తుంటారు. కానీ దీనివల్ల మీ పిల్లలు మీ మాట అస్సలు వినరు. లెక్క చేయరు. ఒకే విషయాన్నిపదేపదే చెప్పడం వల్ల పిల్లలకు చిరాకొస్తుంది. పిల్లలు మీ మాట వినకపోవడానికి కారణం కొన్నిసార్లు భావోద్వేగ సంబంధం లేకపోవడం కూడా ఉంటుంది. అందుకే వారితో మంచి సంబంధాన్నిఏర్పరుచుకోండి. వాళ్లతో మాట్లాడండి.
ఈ ట్రిక్ మీ పిల్లలు మీ మాట వినడానికి బాగా ఉపయోగపడుతుంది. మీ పిల్లలు చెవిన పెట్టనప్పుడు వారి దగ్గరకు వెళ్లి భుజం మీద చెయ్యేసి వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. ఇలా చేయడం వల్ల పిల్లలు మీ మాటలను త్వరగా అర్థం చేసుకుంటారు. అలాగే మీరు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ పిల్లలను బ్రష్ చేయమని చెప్పేటప్పుడు, తినేటప్పుడు లేదా చదవమని చెప్పేటప్పుడు దూరం నుంచి అరవడానికి బదులుగా ఈ ట్రిక్ ను ఫాలో అవ్వండి. దీనివల్ల మీ పిల్లలు మీ మాట ఒక్కసారికే వింటారు.