పిల్లలకు ఏ వయసు నుంచి కాఫీ, టీ ఇవ్వొచ్చు...?
తక్కువ వయసు ఉన్న పిల్లలకు టీ, కాఫీలు పొరపాటున కూడా ఇవ్వకూడదట. అలా ఇవ్వడం వల్ల.. వారి ఎదగుదలను అడ్డుకుంటుంది.
మన దేశంలో టీ, కాఫీ ప్రియులు చాలా ఎక్కువ. ఉదయం లేవగానే వేడి వేడిగా తాగితే వచ్చే ఫీల్ వేరు. అందుకే.. చాలా మంది తమ డే ని వీటితోనే మొదలుపెడతారు. పెద్దలు టీ, కాఫీలు తాగడం కామన్ విషయమే. కానీ... పిల్లల సంగతి ఏంటి..? అసలు వాళ్లకు టీ, కాఫీ లు అలవాటు చేయవచ్చా? చేసినా.. ఏ వయసు నుంచి వారికి అవి ఇవ్వడం మొదలుపెట్టాలి..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
kids eating
నిపుణుల ప్రకారం... పిల్లలకు కాఫీ, టీ ఇవ్వాలి అంటే... కనీసం వారి వయసు 14ఏళ్లు అయినా నిండి ఉండాలట. అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు టీ, కాఫీలు పొరపాటున కూడా ఇవ్వకూడదట. అలా ఇవ్వడం వల్ల.. వారి ఎదగుదలను అడ్డుకుంటుంది. దీని వలన పిల్లలకు చాలా హాని కలుగుతుంది. మీరు మీ పిల్లలకు ఇస్తున్నట్లయితే.. వెంటనే ఆపేయడం బెటర్.
kids eating
నిజానికి కాఫీలో ఉండే కెఫిన్.. మెదడును ఉత్తేజపరిచి గుండె వేగాన్ని పెంచుతుంది. అలాగే, ఇది గ్యాస్ట్రిక్ ఎసిడిటీ, పొత్తికడుపు నొప్పి, ఏకాగ్రత సమస్యలు వంటి సమస్యలను కలిగిస్తుంది. దీంతో పిల్లల నిద్రకు ఆటంకం కలుగుతోంది. పిల్లల నిద్రకు ఆటంకం ఏర్పడినప్పుడు, వారి శారీరక ఎదుగుదల ఆటోమేటిక్‌గా కుంటుపడుతుంది.
kids eating
పిల్లలకు టీ లేదా కాఫీ ఎందుకు ఇవ్వకూడదు?
టీలో టానిన్ ఉంటుంది. ఇది పిల్లల దంతాలు, ఎముకలను బలపరుస్తుంది. కొంతమంది పిల్లలు టీకి అలవాటు పడతారు, ఇది వారికి ప్రమాదకరం. టీ కాఫీలలోని టానిన్లు, కెఫిన్ పిల్లల మానసిక , శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
చక్కెర కంటెంట్:
టీ , కాఫీలలో కెఫిన్ తో పాటు అదనపు చక్కెర ఉంటుంది. ఇది పిల్లలకు హానికరం. అవసరమైతే 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు ఒక కప్పు చిన్న మోతాదు ఇవ్వవచ్చు.
ఈ సందర్భాలలో ఇవ్వవచ్చు:
జ్వరం: మీ బిడ్డకు జ్వరం ఉంటే, మీరు ఒక అల్లం ముక్క , రెండు లేదా మూడు ఏలకులతో టీ తయారు చేయవచ్చు. ఇది వారు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
వికారం: పిల్లల్లో వికారం సాధారణం. ఎందుకంటే వారి రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఉబ్బరం , వాంతులు ఆపడానికి హెర్బల్ టీ ఇవ్వవచ్చు.